శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 20 మే 2017 (16:59 IST)

మ్యూజిక్ మానెయ్యడానికి కారణం నాగార్జున 'నేనున్నాను' చిత్రమే : ఆర్పీ పట్నాయక్

ఆర్పీ పట్నాయక్. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందిన సంగీత దర్శకుల్లో ఒకరు. వరుసబెట్టి సినిమాలకు సంగీతం అందిస్తూనే తన మ్యూజిక్‌ డైరెక్షన్లో, ఇతర సంగీత దర్శకుల వద్ద పాటలు కూడా పాడేవాడు. అలా

ఆర్పీ పట్నాయక్. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందిన సంగీత దర్శకుల్లో ఒకరు. వరుసబెట్టి సినిమాలకు సంగీతం అందిస్తూనే తన మ్యూజిక్‌ డైరెక్షన్లో, ఇతర సంగీత దర్శకుల వద్ద పాటలు కూడా పాడేవాడు. అలాంటి ఆర్పీ కొన్నేళ్ల క్రితం ఒక్కసారిగా సినిమాలు చేయనని ప్రకటించాడు. 
 
దీనికి కారణం హీరో అక్కినేని నాగార్జునే అని ప్రచారం జరిగింది. ఆ వార్తలు ఇప్పటికీ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్నాయి. కానీ, వీటిపై ఆర్పీ ఎప్పుడూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆర్పీ మాట్లాడుతూ... ‘నేను ఇక మ్యూజిక్‌ చేయకూడదు అని నిర్ణయించుకోవడానికి కారణం ‘నేనున్నాను’ సినిమా. ఆ సినిమాకు సంగీత దర్శకుడిగా మొదట నన్నే తీసుకున్నారు. కొన్ని ట్యూన్స్‌ కూడా ఇచ్చాను. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ సినిమాకు సంబంధించిన ఓ పెద్ద వ్యక్తి (పేరు చెప్పను) నాదగ్గరకు వచ్చి ‘నిన్ను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తీసుకోవడం వల్ల సినిమాకు బిజినెస్‌ జరగడం లేద’ని చెప్పారు. 
 
ఆ క్షణమే ఇక మ్యూజిక్‌ చేయకూడదని నిర్ణయించుకున్నాను. నిర్మాత సురక్షితంగా ఉంటే ఎంతో మంది బతుకుతారు. అలాంటి నిర్మాతకు డబ్బులు రాకుండా నేను అడ్డుపడుతున్నానని అనిపించడంతో ఇక మ్యూజిక్‌ డైరెక్టర్‌ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించా. అంతేగానీ, ప్రచారం జరుగుతున్నట్టుగా హీరో నాగార్జునకు ఎలాంటి సంబంధం లేదని ఆర్పీ పట్నాయక్ చెప్పుకొచ్చారు.