శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (19:18 IST)

"నలుగురితో నారాయణ" అంటోన్న అమ్మాయి

Naluguritho Narayana
నలుగురు అబ్బాయిలతో ఒక అమ్మాయి ఎలా ట్రావెల్ చేసింది. ఆమె వీరిని ఎందుకు కలిసింది. వారి మధ్య జరిగిన సంఘటన ఏమిటి అనేదే నలుగురితో నారాయణ జి.ఎల్.బి శ్రీనివాస్ సమర్పణలో అయాన్ ఆర్ట్స్ పతాకంపై శ్రీ కల్వకుంట్ల రవీందర్రావు సారధ్యంలో రంజిత్ రాచకొండ,  సిద్ధార్థ, వంశీధర్, జై సంపత్ ,హీరోలుగా నేహా హీరోయిన్ గా రామ్.యస్. కుమార్ దర్శకత్వంలో ఎండి అస్లాం నిర్మిస్తున్న చిత్రం "నలుగురితో నారాయణ". ట్యాగ్ లైన్ దేవుడే దిక్కు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ ను హైదరాబాద్లోని ఫిలింఛాంబర్ లో ముఖ్య అతిదిగా వచ్చిన శ్రీ కల్వకుంట రవీందర్ రావు గారి విడుదల చేశారు.
 
అనంతరం ఆయ‌న‌ మాట్లాడుతూ, ద‌ర్శ‌కుడు కథ చెప్పినప్పుడు ఇది మంచి యూత్ కు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయనిపించింది ఈ సినిమా పెద్ద ఘన విజయం సాదించాలని కోరుకుంటూ.. ఇందులో నటించిన అందరికీ మరియు నిర్మాత దర్శకుడు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని అన్నారు.
 
చిత్ర నిర్మాత ఎండి అస్లాం మాట్లాడుతూ,  గతంలో ఈ దర్శకుడు తో "అంతా విచిత్రం" తీశాను.ఇప్పుడు మళ్లీ "నలుగురితో నారాయణ" చిత్రాన్ని నిర్మించాను. ఈ చిత్రం బాగా వచ్చింది. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే తను నాకు కొత్త కాన్సెప్ట్ ఉన్న "24 గంటలు" కథ చెప్పడం జరిగింది. ఆ కథ నచ్చడంతో ఇదే బ్యానర్ లో మూడవ చిత్రానికి అవకాశం కల్పించాము.యూత్ కు మంచి ఏంటర్ టైన్మెంట్ ఇచ్చే ఈ సినిమా బాగా వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదల చేస్తామని అన్నారు.
 
చిత్ర దర్శకుడు రామ్ యస్ కుమార్ మాట్లాడుతూ. మేము అనుకున్న ఈ కొత్త కాన్సెప్ట్ కు కొత్త వారైతే కరెక్టు అని సెలెక్ట్ చేయడం జరిగింది. యూత్ కు ఈ రోజుల్లో ఎం కావాలో తెలుసుకొని తీసిన మంచి కంటెంట్ ఉన్న చిత్రమిది.ఈ సినిమాలోని డైలాగులు సింగిల్ మీనింగ్ తో తీశాము కానీ  డబుల్ మీనింగ్ లా అనిపిస్తుంది. అయితే ప్రతి సీన్ అర్థముండే విధంగా ఉంటుంది. మా సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు హ్యాపీ గా ఎంజాయ్ చేస్తారు.నేను ఈ బ్యానర్ లొ రెండు సినిమాలు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నా బర్త్ డే సందర్భంగా నాకు ఇదే బ్యానర్ లో మూడవ సినిమా చేసే అవకాశం కల్పించిన నిర్మాతకు ధన్యవాదాలు. త్వరలో ప్రేక్షకుల  ముందుకు వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుతున్నానని అన్నారు.
 
పాటల రచయిత రవి ములకలపల్లి మాట్లాడుతూ.. మంచి ఏంటర్ టైన్మెంట్ తో వస్తున్న ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉంటాయి  అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు నా ధన్యవాదాలు.ఈ సినిమా పెద్ద విజయం సాధించి మాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.