మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (16:25 IST)

కరోనా కష్టకాలంలో చిత్రపరిశ్రమను తలైవి గట్టెక్కిస్తుంది : కంగనా రనౌత్

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత యేడాది కాలంగా కష్టాల్లో కూరుకునిపోయిన చిత్రపరిశ్రమను గట్టెక్కించేందుకు వస్తున్న చిత్రమే తలైవి అని ఆ చిత్ర హీరోయిన్ కంగనా రనౌత్ వ్యాకఅయానించారు.
 
ఈ చిత్రం ట్రైలర్ గత నెలలో రిలీజ్ కాగా, అద్భుతమైన స్పందన వస్తోంది. దివంగ‌త తమిళ‌నాడు మాజీ సీఎం, న‌టి జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌గా ఏప్రిల్ 23న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అయితే సినిమా విడుద‌ల ఆల‌స్య‌మ‌వుతుంద‌ని పుకార్లు వ‌స్తున్నాయి. 
 
వీటిపై కంగనా రనౌత్ స్పందించారు. క‌రోనా సంక్షోభంలో కూరుకుపోయిన బాలీవుడ్‌ను తాను చేస్తున్న త‌లైవి చిత్రం గ‌ట్టెక్కిస్తుంద‌ని ధీమాగా చెప్తోంది. క‌రోనా లాక్డౌన్ త‌ర్వాత ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి వ‌చ్చాక బాలీవుడ్‌లో ఇప్ప‌టివర‌కు స‌రైన హిట్ సినిమా ప‌డ‌లేదు. 
 
త‌లైవితో బాలీవుడ్ బాక్సాపీస్‌కు ఎన‌ర్జీ వస్తుందన్నారు. త‌లైవి విడుద‌ల తేదీలో ఎలాంటి మార్పు లేదని ట్రేడ్ ఎన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశాడు. కాగా, ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు ఏ విజయ్ తెరకెక్కించారు.