నాని నిర్మాతగా, విజయేంద్ర ప్రసాద్.. కొత్త సినిమాలో సమంత
టాలీవుడ్ అందాల రాశి సమంత ప్రస్తుతం నటన ప్రాధాన్యత గల పాత్రల్లో కనిపించేందుకు రెడీ అయ్యింది. పెళ్లికి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ ఓ వెలుగు వెలిగిపోతున్న సమంత.. తాజాగా లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటించేందుకు సిద్ధమైంది. 'అ' చిత్రంతో నిర్మాతగా మారిన హీరో నాని త్వరలో మరో సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ కథానాయిక ప్రధాన చిత్రంలో సమంత ప్రధాన పాత్ర పోషించే అవకాశం వుందని తెలుస్తోంది. కాగా సమంత, నాని గతంలో ఎటో వెళ్లిపోయింది మనసు, ఈగ సినిమాల్లో నటించారు. ఆ సాన్నిహిత్యంతోనే నాని నిర్మాణంలో నటించడానికి సమంత ఒప్పుకుందని తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ వేసవిలో విడుదల కానుంది. ప్రస్తుతం భర్త చైతూ సమ్మూ ఫారిన్ ట్రిప్పేసింది. ఇంకా భర్త చైతూ కలిసి సమంత మజిలీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.