శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 11 జనవరి 2019 (13:04 IST)

పిల్లనిచ్చిన మామే.. బాబును అలా అన్నారు.. కొడాలి నాని ఫైర్

దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డిపై కూడా ముఠా నాయకుడనీ హత్యలు చేయిస్తాడని.. తన సొంత మీడియాతో ఏపీ సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించారని మండిపడ్డారు. కానీ  అధికారంలోకి వచ్చిన వైఎస్ నిరుపేదలకు 48 లక్షల ఇళ్లు నిర్మించి, పేద పిల్లలకు ఫీజు రియంబర్స్ మెంట్ చేశారని గుర్తుచేశారు.
 
వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా జగన్ వస్తే ఆయన్ను అధికారం నుంచి తప్పించలేమన్న భయంతో చంద్రబాబు, ఆయన భజన పత్రికలతో తప్పుడు ఆరోపణలు చేయించారని కొడాలి నాని తెలిపారు. అలాగే పిల్లనిచ్చిన మామగారు నందమూరి ఎన్టీఆర్ స్వయంగా తన నోటితో చంద్రబాబును మించిన అవినీతి చక్రవర్తి ఎవ్వరూ లేరని చెప్పారని నాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 
 
చంద్రబాబు గురించి పిల్లనిచ్చిన మామే చెప్పారని.. చంద్రబాబు వెన్నుపోటు దారుడని.. చంద్రబాబు లాంటి నీచాతి నీచమైన వ్యక్తి ఎవ్వరూ లేరని ఎన్టీఆర్ చెప్పిన విషయాన్ని వెల్లడించారు. ఏపీ సీఎంతో పాటు టీడీపీ నేతలు ఉచిత ఇసుక ద్వారా రూ.25,000 కోట్లు, నీరు-మట్టి కింద మరో రూ.45,000 కోట్ల నిధులు, రాజధానిలో లక్షల కోట్ల భూములను స్వాహా చేశారని నాని ఆరోపించారు.