మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 21 డిశెంబరు 2018 (12:20 IST)

పరిపూర్ణత్వానికి మారుపేరు.. నారా బ్రాహ్మణిని అమితంగా ప్రేమిస్తున్నా..

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ తన సతీమణి నారా బ్రాహ్మణి పుట్టిన రోజును పురస్కరించుకుని ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. హెరిటేజ్ గ్రూప్ మేనేజింగ్ డైరక్టర్, ఏపీ సీఎం కోడలు అయిన నారా బ్రాహ్మణికి శుక్రవారం పుట్టిన రోజు. ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని, నందమూరి, నారా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ వున్నారు. ఈ క్రమంలో నారా లోకేష్ కూడా తన సతీమణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఈ ప్రపంచంలో ఏదీ పరిపూర్ణంగా వుండదని చాలామంది చెప్తుంటారు. కానీ అలా చెప్పిన వారంతా నారా బ్రాహ్మణిని చూసివుండరు. నారా బ్రాహ్మణి పరిపూర్ణత్వానికి మారుపేరు అని నారా లోకేష్ కొనియాడారు. అంతేగాకుండా.. హ్యాపీ బర్త్ డే నారా బ్రాహ్మణి... నిన్ను అమితంగా ప్రేమిస్తున్నానని లోకేష్ రొమాంటిక్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి, దేవాన్ష్‌తో కలిసి వున్న ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం నారా లోకేష్ ట్వీట్ వైరల్ అవుతోంది.