శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 26 డిశెంబరు 2018 (20:19 IST)

వాళ్ల ముసుగులు తీస్తే.. మోదీ ముఖమే కనిపిస్తుంది.. వాళ్లెవరు..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీల నాయకులు నాటకాలాడుతున్నారని, వాళ్ల ముసుగులు తీయాలని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో జగన్ ముసుగు తీస్తే ప్రధాని నరేంద్ర మోదీ ముఖమే కనిపిస్తుందని బాబు ఫైర్ అయ్యారు. 
 
అలాగే జనసేనాని పవన్ కల్యాణ్‌పై కూడా చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ హక్కుల కోసం పవన్ కల్యాణ్ ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అహంతో లేదా వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుని రాష్ట్రానికి అన్యాయం చేస్తే చరిత్ర మనల్ని క్షమించదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. కులమతాలకు అతీతంగా తమ పార్టీ పనిచేస్తుందని.. ఏ కులాన్ని తమ పార్టీ పక్కనబెట్టలేదని బాబు తెలిపారు.
 
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ పోవాలని, ప్రత్యామ్నాయం రావాలని, మన రాష్ట్రానికి న్యాయం జరగాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. అనంతపురంలో ధర్మపోరాట దీక్ష సభలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు అయ్యే వరకూ నిద్రపోవద్దని ప్రజలకు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. కుట్రలు చేసేటప్పుడు ఎదురు నిలిచి పోరాడాలని, లేకపోతే బలైపోతామని అన్నారు.