శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 25 డిశెంబరు 2018 (11:24 IST)

నాగబాబు, వరుణ్ తేజ్‌లకు కృతజ్ఞతలు: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ మీద అభిమానంతోను, ఈ పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న కాంక్షతో నా చిన్న అన్నయ్య నాగబాబు, ఆయన కుమారుడు, హీరో వరుణ్ తేజ్‌లు పార్టీకి అందించిన విరాళానికి నేను పత్రికాముఖంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. 
 
శ్రీ నాగబాబు గారు రూ.25 లక్షలు, వరుణ్ తేజ్ కోటి రూపాయలు వంతున పార్టీకి విరాళం అందచేశారని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. శ్రీ నాగబాబు, శ్రీ వరుణ్ తేజ్‌లు అందించిన విరాళాలు పార్టీకి క్రిస్మస్ కానుకగా నేను భావిస్తున్నాను అని తెలియచేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.