పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగబాబు.. ఏంటవి..?
తమ్ముడు పవన్ కళ్యాణ్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు, అన్న నాగబాబు. బిజీగా ఉండడం కారణంగా కళ్యాణ్ బాబుకు సహాయం చేయలేకపోతున్నాను. రాజకీయాల్లో కళ్యాణ్ దూకుడు నాకు బాగా నచ్చుతోంది. నా తమ్ముడు లాంటివారు రాజకీయాల్లో ఎంతో అవసరం.
జవాబుదారీతనం, రాజకీయం, పదిమందికి ఉపయోగపడే రాజకీయం చేస్తున్నాడు నా తమ్ముడు. నా కొడుకు వరుణ్ నాపై ఒత్తిడి తెస్తున్నాడు. రాజకీయాల్లో బాబాయ్ ఒక్కడే పోరాటం చేస్తున్నాడు. మనం కూడా ఏదో రకంగా ఆయనకు సహకారం అందించాలంటున్నాడు. అందుకే అప్పుడప్పుడు నేను కూడా నా తమ్ముడి గురించి మాట్లాడుతున్నాను.
నా తమ్ముడికి గాజు గ్లాసు గుర్తు కేటాయించడం సంతోషంగా ఉంది. టీ, కాఫీని గాజు గ్లాసులో తాగితే ఆ టేస్టే వేరు. నా తమ్ముడికి మంచి గుర్తు కేటాయించింది ఎన్నికల కమిషన్. కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నా ప్రజల కోసం కళ్యాణ్ బాబు రాజకీయాలను ఎంచుకున్నారని చెప్పారు నాగబాబు. పవన్ కళ్యాణ్‌కు కేటాయించిన ఆ గాజు గ్లాస్ గుర్తుతో ఒక కొత్త రాజకీయ చరిత్రని సృష్టించడం ఖాయమంటున్నారు నాగబాబు.