Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెజాన్ ప్రైమ్‌లో వస్తానంటున్న 'నారప్ప'

Written By ఠాగూర్
Updated: సోమవారం, 12 జులై 2021 (16:42 IST)
విక్టరీ వెంకటేష్, జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి జంటగా నటించిన చిత్రం నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కాబోతోంది. 
 
గత కొన్ని రోజులుగా ఈ చిత్ర విడుదల విషయంలో సందిగ్ధత నెలకొనివుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం విడుదలపై తాజాగా క్లారిటీ వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేసేలా నిర్మాతల ప్లాన్ చేశారు. 
 
నిజానికి ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయడానికి ఆలోచిస్తున్నామని ప్రకటించిన నిర్మాత సురేష్‌ బాబు.. తన అభిప్రాయాన్ని మార్చుకుని ఇప్పుడు ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ చిత్రం జూలై 20వ తేదీన స్క్రీనింగ్‌ కాబోతున్నట్లుగా అధికారికంగా చిత్రయూనిట్‌ ప్రకటించింది.
 
ఇదే విషయాన్ని విక్టరీ వెంకటేష్‌ కూడా తన ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. నారప్ప చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నట్లుగా ట్వీట్‌ చేశారు. 
 
ఒకవైపు పెద్ద చిత్రాలను ఓటీటీలో విడుదల చేయవద్దంటూ నిర్మాతలను తెలంగాణ ఫిల్మ్‌చాంబర్‌, ఎగ్జిబిటర్స్‌, డిస్ట్రిబ్యూటర్స్‌ కోరుతుంటే.. మరోవైపు కోలీవుడ్‌లోని బడా నిర్మాతల్లో ఒకరైన డి.సురేష్ బాబు తమ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించడం గమనార్హం. 

అన్నీ చూడండి

శభాష్ ఝార్ఖండ్ స్టూడెంట్స్, ఎవరినీ అవమానించకుండా సాధించారు: కంగనా రనౌత్

పవన్ కల్యాణ్‌ను ఏపీ సీఎంని చేయడమే లక్ష్యం: కుండబద్ధలు కొట్టిన పంతం నానాజీ

ఏఈ ఫ్యామిలీ కేసు.. షేక్ సాధిక్‌పై నూకరాజు వియ్యంకుడు కేసు.. పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి?

ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తాం.. బీసీ జనార్ధన్ రెడ్డి

Nalgonda: విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. అధ్యాపకుడిపై దాడి

అన్నీ చూడండి

ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?

ఆగిన గుండే... ట్రాన్స్‌ప్లాంట్‌తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు

ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు

ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్

రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు

తర్వాతి కథనం
Show comments