శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 6 మే 2017 (10:59 IST)

యూట్యూబ్‌లో ఆల్‌టైమ్ ఫేవరేట్ హిందీ సాంగ్‌‌గా బేఫిక్రే పాట.. (Video)

రణ్‌వీర్ సింగ్, వాణికపూర్, ఆదిత్యాచోప్రా కాంబోలో రిలీజైన బేఫిక్రే మూవీ బాక్సాపీస్ వద్ద సూపర్‌హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రణ్‌వీర్, వాణికపూర్ కాంబినేషన్‌లో వచ్చిన సాంగ్ యూట్యూబ్‌లో వైరల్‌గా మ

రణ్‌వీర్ సింగ్, వాణికపూర్, ఆదిత్యాచోప్రా కాంబోలో రిలీజైన బేఫిక్రే మూవీ బాక్సాపీస్ వద్ద సూపర్‌హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రణ్‌వీర్, వాణికపూర్ కాంబినేషన్‌లో వచ్చిన సాంగ్ యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ‘నశే సి ఛడ్ గయి’ అంటూ సాగే సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన హిందీ పాటగా రికార్డు సృష్టించింది. రణ్‌వీర్‌సింగ్, వాణీకపూర్ మధ్య వచ్చే ఈ పాటను పారిస్‌లో షూట్ చేశారు. 
 
యూట్యూబ్‌లో ఆల్‌టైమ్ ఫేవరేట్ హిందీ సాంగ్‌గా నిలవడం పట్ల యశ్‌రాజ్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ గుర్నానీ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ పాట విడుదలైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించినట్లు రికార్డుంది. తాజాగా ఆరు నెలల్లో యూట్యూబ్‌లో 234 మిలియన్ల (23.4 కోట్లు) అత్యధిక వ్యూస్ సాధించిన హిందీ పాట ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది.