గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 10 ఏప్రియల్ 2023 (17:07 IST)

పోసాని కమ్మ అవార్డులుపై నట్టికుమార్ ధ్యజం

Posani-nattikumar
Posani-nattikumar
ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి గతంలో ఇచ్చిన నంది అవార్డులను కమ్మ అవార్డులుగా పోల్చడం పట్ల నట్టికుమార్ మండిపడ్డారు. ఆ మాట ఎంతమాత్రం సరికాదు. చిత్ర పరిశ్రమ వాళ్లదంతా ఒకే కులం, ఒకే మతం. ఇక్కడ చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్న వ్యత్యాసం మాత్రం బోలెడంత ఉంది.కానీ కులం మాత్రం ఒకటే అది సినిమా కులం. పెద్ద వాళ్లు చెప్పిందే రెండు తెలుగు ప్రభుత్వాలు వింటున్నాయి తప్ప చిన్న వాళ్ళను పట్టించుకోవడం లేదు. చిన్న సినిమాలకు ఏపీ ప్రభుత్వమైనా కొంత న్యాయం చేస్తున్నది కానీ తెలంగాణ ప్రభుత్వం తమ దృష్టికి సరిగా రాకనో ఏమో తెలియదు కానీ చిన్న సినిమాల  సమస్యలను పరిష్కరించడం లేదు. 

మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి  విన్నపం
 
మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా తాము చిత్ర పరిశ్రమకు ఎంతో చేసినట్లు చెప్పారు. అయితే వాస్తవంలో సినిమాలకు తెలంగాణలో 32 పర్చెంట్ వాటా వస్తే, ఏపీలో 68 పర్చెంట్ వస్తోంది. అయినప్పటికీ చాలా కంపెనీలు తెలంగాణాలోనే రిజిస్టర్ అయ్యి, ఇక్కడే తమ జీఎస్టీని చెల్లిస్తున్నాయి. ఈ విషయాలన్నీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి తెలుసో, లేదో నాకు తెలియదు. వారు ఇవన్నీ తెలుసుకోవాలని నా విన్నపం. అలాగే 2014 తర్వాత తెలంగాణ లో షూటింగ్ లొకేషన్స్ చార్జీలు 30 రెట్లు పెరిగాయి. చిన్న నిర్మాతలు తమ సినిమాలను తెలంగాణలోని థియేటర్లలో వేసుకోవాలంటే చాలా కష్టమైపోతోంది. పర్చెంట్ పద్దతిలో కాకుండా చిన్న నిర్మాతలను రెంటల్స్ చెల్లించమని అడుగుతుండటంతో చిన్న సినిమాలు బతకడం లేదు. అలాగే చిన్న సినిమాలకు మధ్యాహ్నం 2-30 గంటలకు తప్పనిసరిగా ఒక మాట్నీ షో  ఇవ్వమని కోరిన కోరిక ఇంతవరకు ఫలించలేదు. 

ఏపీ ఫైబర్ నెట్ 2013లో..
 
ఏపీలో షూటింగులు చేస్తే రాయితీలు, ప్రోత్సహకాలు ఇస్తామని ప్రభుత్వం వారు చెబుతున్నారు కూడా. 30 పర్చెంట్ షూటింగ్ లు చేస్తామని పరిశ్రమ తరపున సినీ పెద్దలు మాట కూడా ఇచ్చారు. అయినప్పటికీ చాలామంది చేయడం కూడా లేదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏపీ ఫైబర్ నెట్ ద్వారా  సినిమాలను రిలీజ్ చేస్తామని మొన్న ఓ మీటింగ్ పెట్టారు. వాస్తవానికి ఈ ప్రతిపాదన ఎప్పుడో 2013లో నేను ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్ గా ఉన్నప్పుడే వివిధ సంస్థల ద్వారా వచ్చింది. అయితే అది వర్కవుట్ కావడం కష్టమని అనిపించింది. మళ్ళీ దానిని తీసుకుని వస్తే, చిత్ర పరిశ్రమలోని అందరితో కలిసి మీటింగ్ పెడితే బావుండేది. పోసాని గారు కానీ అలీ గారు కానీ చిత్ర పరిశ్రమలోని వారితో మమేకమై ముందుకు వెళితే బావుంటుంది' అని అన్నారు