ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీ.వీ.
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2023 (12:45 IST)

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ చిత్రానికి సరిపోదా శనివారం ఖరారు

nani31-saripodha sanivaaram
nani31-saripodha sanivaaram
నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి సరిపోదా శనివారం టైటిల్ ఖరారు చేశారు. దసరా సంధర్భంగా నేడు సోమవారంనాడు అన్‌చెయిన్ పేరుతో గ్లిమ్ప్స్ విడుదల చేశారు. ఇందులో.. ఓ పాతపడిన షెడ్డు లో నాని కాళ్ళు గొలుసులతో, చేతులు వెనక్కు తాళ్లతో కట్టి ఉంటాడు. అక్కడ గోడ గడియారాలు, టేబుల్ గడియారాలు చాలా ఉంటాయి. ఆవేశంలో శక్తి తెచ్చుకుని.. అక్కడే ఉన్న కత్తిపీట తో చేసి కట్లు తెంపుకుంటాడు. దగ్గరలో ఉన్న సుత్తి తో కాళీ గొలుసులను కట్ చేస్తాడు. వెంటనే ఫైర్ అవుతుంది. అలా షెడ్ కాలిపోతుంది. ఆ తరువాత క్యాలెండరు లో పేజీలు కాలిపోతూ నవంబర్ 21, శనివారం తేదీ కాగితం నాని చేతికి చిక్కుతుంది. అల్లా దాని పట్టుకుని బయటకు రాగానే ఊరి జనం ఎదురుగ కనిపిస్తారు.. శనివారం మొదలైంది.. అని షూట్ గురించి హిట్ ఇచ్చారు.
ఈ సినిమాను  డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మస్తున్నారు.నాని, వివేక్ ఆత్రేయ ఈసారి డిఫరెంట్ ప్రయత్నించబోతున్నారని కూడా మేకర్స్ సూచించారు. రేపు 24న గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు.