శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీ.వీ.
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2023 (11:41 IST)

వివేక్ ఆత్రేయ, నాని31 సినిమాలో కీలక పాత్రలో ఎస్.జె.సూర్య

SJ surya
SJ surya
నేచురల్ స్టార్ నానితో 'అంటే సుందరానికీ' లాంటి కల్ట్ ఎంటర్‌టైనర్‌ని అందించిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మరోసారి #నాని31 కోసం కలిసి వస్తున్నారు. తమ గత చిత్రం ఆస్కార్‌ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌'ను అందించిన డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ప్రాజెక్ట్ గురించి చాలా క్యురియాసిటీ పెంచిన అనౌన్స్ మెంట్  వీడియోను విడుదల చేయడంతో యూనిట్ నిన్న ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసింది. నాని, వివేక్ ఆత్రేయ ఈసారి డిఫరెంట్ ప్రయత్నించబోతున్నారని కూడా మేకర్స్ సూచించారు.

ఇప్పుడు సినిమాలో నటీనటుల వివరాలను వెల్లడిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ ను చిత్రంలో హీరోయిన్ గా అనౌన్స్ చేశారు. తాజాగా, తమిళ స్టార్ యాక్టర్ ఎస్ జె  సూర్యను ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారని మేకర్స్ తెలియజేశారు. ఎస్‌జె సూర్య క్రేజీ క్యారెక్టర్స్‌ చేయడంలోపాపులర్, ఇప్పుడు వివేక్ ఆత్రేయ, ఎస్‌జె సూర్య కోసం ఖచ్చితంగా క్రేజీ పాత్రని డిజైన్ చేసివుంటారు.

ఈ నెల 24న గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు