శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2023 (11:05 IST)

ది గర్ల్ ఫ్రెండ్‌గా రాబోతోన్న రష్మిక మందన్న

Rashmika Mandanna
Rashmika Mandanna
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్, బ్లాక్‌బస్టర్ మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో లేడి ఓరియెంటెడ్ మూవీకి చేతులు కలిపాయి. 
 
టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ రాహుల్ రవీంద్రన్ ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక తన అన్ని చిత్రాలలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది.
 
ఈ సినిమా అన్నీ వయసుల ప్రేక్షకులకు ఒక రకమైన సినిమాటిక్ అనుభవంగా ఉంటుంది. చిత్రం టైటిల్ "ది గర్ల్‌ఫ్రెండ్". తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన ఫోటోగ్రఫీ త్వరలో ప్రారంభం కానుంది. 
 
కృష్ణన్ వసంత్ కెమెరా పనితనం, సంగీత సంచలనం హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం ఈ సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తే, విద్యా కొప్పినీడి అండ్ ధీరజ్ మొగిల్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.