శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2023 (10:37 IST)

ప్రియురాలితో కానిస్టేబుల్ భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..

wife swap game
ప్రియురాలితో కలిసి వున్న కానిస్టేబుల్‌కు అతని భార్య చుక్కలు చూపించింది. కానిస్టేబుల్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆపై పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్లపాడు సీఐ బత్తుల శ్రీనివాసరావు. 
 
శ్రీనుకు పల్నాడు జిల్లా నాదెండ్లకు చెందిన దివ్యతో వివాహం జరిగింది. వీరు నాదెండ్లలో నివాసం వుంటున్నారు. ఇంతలో శ్రీనుకు దాచేపల్లికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఆమె ఎస్సై పోటీల కోసం కోచింగ్ తీసుకుంటూ గుంటూరులో వుంది. వీరి పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. 
 
వీరిద్దరూ ఓ అపార్ట్‌మెంట్‌లో కొంతకాలంగా కలిసి వుంటున్నారు. దీంతో కానిస్టేబుల్ భార్యను పక్కన బెట్టేశాడు. ఇక తనను పట్టించుకోని భర్తకు ఆ భార్య చుక్కలు చూపించింది. ప్రియురాలితో అపార్ట్‌మెంట్‌లో వున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. పోలీసులకు భర్తను అప్పగించింది. అతనిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.