ఆదివారం, 15 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (16:02 IST)

రణబీర్ కపూర్, రష్మిక మందన్న మధ్య ఫస్ట్ నైట్ సీన్..?

Rashmika Mandanna
Rashmika Mandanna
విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి, షాహిద్ కపూర్ నటించిన కబీర్ సింగ్ తర్వాత బోల్డ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన మరో చిత్రం యానిమల్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబో రూపొందినప్పటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. 
 
యానిమల్ టీజర్ గ్లింప్స్ చూసిన తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న మధ్య ఫస్ట్ నైట్ సీన్ ఉంది. కానీ వారి మొదటి రాత్రి సమయంలో, విలన్లు దాడి చేస్తారు. అతను విలన్‌లను గాలిలోకి పంపడం, మరోవైపు, రణబీర్ కూడా రొమాన్స్ చేయడం కనిపిస్తుంది. 
 
యానిమల్ సినిమాలో రష్మిక, రణబీర్ ఫస్ట్ నైట్ సీన్ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే సాహో సినిమాలో రొమాన్స్, వయలెన్స్ వంటి సన్నివేశాలు చూశాం. 
 
ప్రభాస్‌పై విలన్లు తుపాకీతో దాడి చేస్తుంటే, శ్రద్ధా రొమాన్స్ చేస్తూ డార్లింగ్‌ను షూట్ చేయడం బాగా వర్కవుట్ అయింది. మరి యానిమల్‌లో రణబీర్ హింస, రొమాన్స్ ఎలా ఉంటాయో చూద్దాం.