శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2023 (18:53 IST)

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ఆవిష్కరించిన ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా సాంగ్

Anand Devarakonda, Pragati Srivastava
Anand Devarakonda, Pragati Srivastava
"బేబి" ఫేమ్  ఆనంద్ దేవరకొండ యాక్షన్ కామెడీ జానర్ తో "గం..గం..గణేశా" సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ బొమ్మిశెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
 
"గం..గం..గణేశా" సినిమా నుంచి బృందావనివే లిరికల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న రిలీజ్ చేసింది. ఆనంద్ గత సూపర్ హిట్ ఫిల్మ్ "బేబి"లోని ప్రేమిస్తున్నా సాంగ్ కూడా రశ్మికనే విడుదల చేసింది. ఆ సాంగ్ కంటే బృందావనివే పాట బిగ్ హిట్ కావాలని రశ్మిక బెస్ట్ విశెస్ తెలియజేసింది. తమ సినిమాలోని పాట రిలీజ్ చేసిన రశ్మికకు థాంక్స్ చెప్పారు హీరో ఆనంద్ దేవరకొండ. బ్యూటిఫుల్ మెలొడీ సాంగ్ బృందావనివే మీకు నచ్చుతుందని ఆయన ట్వీట్ చేశారు.
 
చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన బృందావనివే  పాటకు వెంగి సుధాకర్ లిరిక్స్ అందించారు. సిధ్ శ్రీరామ్ తో కలిసి చేతన్ భరద్వాజ్ ఈ పాట పాడారు. 'బృందావనివే యవ్వనివే నీవే, నా మనసే నీ వశమే రా, ప్రేయసివే ఊర్వశివే నీవే, ఆరాధనమైనావే...' అంటూ మంచి లవ్ ఫీల్ తో బ్యూటిఫుల్ మెలొడీగా ఆకట్టుకుంటోందీ పాట. "గం..గం..గణేశా" త్వరలో థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 
నటీనటులు :ఆనంద్ దేవరకొండ,ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్,సత్యం రాజేష్,రాజ్ అర్జున్ తదితరులు.