ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మార్చి 2021 (20:50 IST)

'అర్జున్ రెడ్డి'తో విజయ్ దేవరకొండ.. జాతిరత్నాలుతో నవీన్ పోలిశెట్టి!!

Naveen Polishetty
టాలెంట్ వున్న వాడిని ఎవరూ తొక్కేయలేరని మరోసారి టాలీవుడ్‌లో రుజువైంది. విశ్వక్ సేన్, కార్తీకేయ వంటి వారు సక్సెస్ అయ్యారు. తాజాగా ఇదే బాటలో సాగి తన సత్తా చాటుతున్నాడు నవీన్ పోలిశెట్టి. కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రల్లో నటించిన నవీన్ ప్రతిభను ఇప్పుడు ఇటు టాలీవుడ్ మాత్రమే కాదు అటు బాలీవుడ్ కూడా గుర్తిస్తోంది. అతను నటించిన హిందీ సినిమా 'చిచ్చోర్' మంచి విజయం సాధించడం దానికి ఉదాహరణ.
 
పెద్ద తెర, చిన్న తెర, రంగస్థలం, యూట్యూబ్... అనే ఫరక్ లేకుండా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తన టాలెంట్‌ను ఫ్రూవ్ చేసుకుంటూ సాగుతున్న నవీన్ కూ ఓ రోజు వచ్చింది. అది 'జాతి రత్నాలు' రూపంలో రావడం విశేషం. సోలో హీరోగా అతను నటించిన తొలి చిత్రం 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' సక్సెస్ జనానికి రీచ్ కావడానికి, ఇండస్ట్రీ దానిని గుర్తించడానికి కొద్దిగా టైమ్ పట్టింది. కానీ ఇవాళ 'జాతిరత్నాలు' విడుదలైన తొలి రోజునే భారీ కలెక్షన్లను రాబట్టి... నవీన్ పోలిశెట్టిని కమర్షియల్ హీరోల జాబితాలో నిలబెట్టేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి
 
'పెళ్ళిచూపులు'తో హిట్ కొట్టి, 'అర్జున్ రెడ్డి'తో గ్రాండ్ సక్సెస్‌ను విజయ్ దేవరకొండ తన ఖాతాలో వేసుకున్నట్టే. ఇవాళ 'జాతిరత్నాలు'తో నవీన్ పోలిశెట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడని కొందరంటున్నారు. అంతేకాదు... భారీ నిర్మాణ సంస్థలు సైతం అతనితో మూవీస్ ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అవుతున్నాయట. ఇప్పటికే 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' సీక్వెల్‌కు నవీన్ పచ్చజెండా ఊపాడు. మరి ఈ కామెడీ హీరో ఎంతకాలం తన సక్సెస్ జర్నీని కొనసాగిస్తాడో చూడాలి.