గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : ఆదివారం, 7 మార్చి 2021 (23:32 IST)

ఆ సినిమాలో కొట్లాడి మ‌రీ నాకు రోల్ ఇచ్చాడు. ఈస్థాయికి కార‌ణం త‌నేః విజ‌య్ దేవ‌ర‌కొండ

Vijay, Nag aswin
ఇక్కడున్న వారంతా నా ఫ్రెండ్స్. నా జీవితంతో ఏదో ఒకలా ప్రతీ ఒక్కరూ ముడిపడి ఉన్నారు.. కలిసి కలలు కన్నాం. కష్టాలు చెప్పుకున్నాం. నవ్వించారు.. ధైర్యమిచ్చారు. వంద వంద వేసుకుని తిన్నాం. తాగాం. దర్శిలేకపోతే పెళ్లి చూపుల్లో ప్రశాంత్ లేడురా. దర్శి ఇప్పుడు అన్ని ఫ్లాట్‌ఫాంలో చేస్తున్నాడు. ప్రతీ రోజూ బిజీగా ఉంటున్నాడు. శివ లేకపోతే అర్జున్ లేడు. రాహుల్ రామకృష్ణను నటుడిగా నిన్ను ఎప్పుడూ గౌరవిస్తాను. ఆరేళ్ల క్రితం నువ్ హీరోగా నిలబడుతావ్ మన ముందు ఓ 25 వేల మంది ఉంటారు. మనం మాట్లాడతామని అనుకుంటే నవ్వుకునేవాళ్లం. కానీ ఇంటికెళ్లి ఇదే కలలు కనేవాళ్లం. పడుకునే వాళ్లం కాదు. మేం అంతా కలిసి థియేటర్ చేసే వాళ్లం. నేను నవీన్ ఒక గ్రూపులో దర్శి, రాహుల్ మరో గ్రూపులో కలిసి నటించేవాళ్లు. ఆరేళ్ల క్రితం కూడా ఇదే టాలెంట్ ఉంది. టైం ఇప్పుడు వచ్చింది. ఇక్కడున్నాం. గుర్తుండిపోయే జర్నీ ఇస్తాం.

Vijay, nag aswin happy
నేను ఈ రోజు ఇక్కడ ఉండటానికి కారణం నాగ్ అశ్విన్. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చేసేటప్పుడు చిన్న చిన్న రోల్స్ ఇచ్చేవాడు. యాడ్ ఫిల్మ్ చేస్తే నన్నుపెట్టుకున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యంలో కొట్లాడి మరీ రోల్ ఇచ్చాడు. నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం నాగీ. ఇలా ఉండు అలా ఉండు. అందరిలా ఉండు అనే వాడు కాదు. నీలా ఉండు అని చెప్పేవాడు. ఫస్ట్ ప్రమోషన్స్‌కి వెళ్లేటప్పుడు గుర్తుండిపోయే మెమోరీ ఇవ్వమని నాగీ చెప్పాడు. ఇప్పటికీ అదే గుర్తు పెట్టుకున్నాం. మధ్య మధ్యలో అనుదీప్ షార్ట్ ఫిలిమ్ చూపించి నవ్వించేవాడు. ఫరియా ఎంతో ఎనర్జీతో నటించావ్. నీ జర్నీ కూడా మాలానే మొదలైందని విన్నాను. మా అందరి కంటే మంచి నటిలా ఉన్నావ్. మా మొదటి సినిమాలో నీ అంత యాక్టింగ్ చేయలేదు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నన్ను నటుడిగా వైజయంతీ మూవీస్ లాంచ్ చేసింది. ఇలా ఫ్రెండ్స్ అందరితో స్టేజ్షేర్ చేసుకోవడం. కన్న కలలన్నీ కూడా నిజం కావడంఎంతో గొప్పగా ఉంది.  మార్చి 11న జాతి రత్నాలు.. వెళ్లండి. చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు