సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 21 జూన్ 2017 (12:52 IST)

'ఇంకానా.. ఇకపై చెల్లదు' అంటున్న నయనతార

నయనతార ప్రధాన పాత్రధారిగా ఓ చిత్రం నిర్మితమవుతోంది. మలయాళంలో విజయం సాధించిన ‘పుదియ నియమం’ చిత్రానికి తెలుగు అనువాదమిది. మహిళలపై జరుగుతున్న అకృత్యాలను నిరిసిస్తూ ‘ఇంకానా.. ఇకపై చెల్లదు’ అంటూ వాటికి వ్య

నయనతార ప్రధాన పాత్రధారిగా ఓ చిత్రం నిర్మితమవుతోంది. మలయాళంలో విజయం సాధించిన ‘పుదియ నియమం’ చిత్రానికి తెలుగు అనువాదమిది. మహిళలపై జరుగుతున్న అకృత్యాలను నిరిసిస్తూ ‘ఇంకానా.. ఇకపై చెల్లదు’ అంటూ వాటికి వ్యతిరేకంగా పోరాడే యువతి పాత్రలో ఆమె నటిస్తోంది. ఈ చిత్రం పేరు ‘వాసుకి’. 
 
ఈ సినిమాలో తన నటనకు ఈ యేడాది ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ పొందారామె. శ్రీరామ్‌ సినిమా పతాకంపై ఎస్‌.ఆర్‌. మోహన్‌ ఈ సినిమాని తెలుగులోకి అనువదించారు. సెన్సార్‌ పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని వచ్చే నెల ప్రథమార్థంలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ చిత్రానికి మాటలు: వెంకట్‌ మల్లూరి, పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, సంగీతం: గోపిసుందర్‌, సహనిర్మాతలు: ఎ.వి. ప్రభాకరరావు, ఉమాశంకర్‌ నండూరి, దర్శకత్వం: ఎ.కె.సాజన్‌.