గురువారం, 20 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 19 మార్చి 2025 (13:12 IST)

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Niharika Konidala, Director Manasa Sharma
Niharika Konidala, Director Manasa Sharma
ప్రతిభను వెలుగులోకి కొత్త వారిని ప్రోత్సహిస్తూ  పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ స్తాపించిన నిహారిక కొణిదల తొలి ప్రయత్నంగా కమిటీ కుర్రోళ్ళ చిత్రాన్ని నిర్మించారు. అంతా కొత్తవారైనా నేటి ట్రెండ్ కు తగినట్లు వుండడంతో అందరూ కనెక్ట్ అయి సక్సెస్ చేశారు. ఆ ఉత్సాహంతో రెండో ప్రయత్నం చేస్తున్నారు. రెండోవ సినిమా ను మహిళా దర్శకురాలితో నిర్మించబోతున్నారు. ఆమె పేరు మానస శర్మ.
 
మానస శర్మ ఇంతకుముందు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో క్రేటివ్ డైరెక్టర్ గా "ఒక చిన్న ఫ్యామిలి స్టోరీ" (జీ 5 వెబ్ సిరీస్) లాగే డైరెక్టర్ గా "బెంచ్ లైఫ్" (సోనీ లివ్ వెబ్ సిరీస్) చేశారు.  ఆమె చెప్పిన కథను టేకింగ్ నచ్చి ఇప్పుడు ఆమెకు తమ బేనర్ లో మూడో అవకాశాన్ని ఇచ్చారు.  మానస శర్మ  పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో 3 వ ప్రాజెక్టు గా ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని నీహారిక వెల్లడించారు.