గురువారం, 29 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 అక్టోబరు 2022 (22:54 IST)

ప్రభాస్ సంచలన నిర్ణయం.. పుట్టినరోజు వేడుకలకు దూరం.. (video)

Prabhas
డార్లింగ్ ప్రభాస్ సంచలనం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 23 ఆదివారం ఆయన పుట్టినరోజు కానీ.. పెదనాన్న కృష్ణంరాజు కోల్పోయిన బాధలో వున్న ఆయన ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. అంతేకాకుండా.. అభిమానులను కూడా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించవద్దని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో 'సలార్‌', 'ఆదిపురుష్‌', 'ప్రాజెక్ట్‌ కె' చిత్రాలున్నాయి. తాజాగా మారుతి దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభమైంది. ఆదివారం డార్లింగ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న చిత్రాల నుంచి క్రేజీ అప్‌డేట్‌ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
ఈ మేరకు ప్రాజెక్ట్‌ కె దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఇప్పటికే హింట్‌ ఇచ్చారు. ఈ చిత్రం నుంచి తాజా అప్డేట్ రానుంది. ఇందులో ప్రభాస్‌ సరసన దీపికా పదుకునే నటిస్తోంది. ఇంకా అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో కనిపిస్తారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు.