1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 18 సెప్టెంబరు 2016 (11:40 IST)

అందుకే సినిమాలు చేయట్లేదు.. సౌత్ సినిమాలపై సమంత సెన్సేషనల్ కామెంట్స్

అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలు మొదలైన దగ్గర నుంచి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొత్త సినిమాలకు సంతకం చేయట్లేదు. త్వరలో పెళ్లి పీటలెక్కుతున్న కారణంగానే కొత్త సినిమాలకు అంగీకరించటం లేదన్న ప్రచారం

అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలు మొదలైన దగ్గర నుంచి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొత్త సినిమాలకు సంతకం చేయట్లేదు. త్వరలో పెళ్లి పీటలెక్కుతున్న కారణంగానే కొత్త సినిమాలకు అంగీకరించటం లేదన్న ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో, తను సినిమాలు ఎందుకు అంగీకరించటం లేదో స్పష్టత ఇచ్చింది. మంచి పాత్రలు రానందువల్లే సినిమాలు చేయట్లేదని వెల్లడించింది.
 
ఇంకా దక్షిణాది సినిమాలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సౌత్ సినిమాల్లో హీరోయిన్‌కి అర్థవంతమైన పాత్రలు పోషించే అవకాశం రావడం కష్టమేనని, అందుకే తాను అనుకున్నన్ని సినిమాలు చేయలేకపోయాను అని సమంత ట్వీట్ చేసింది. 
 
ఈమె ట్వీట్ చూసిన సినిమా పెద్దలు మాత్రం సమంతపై మండిపడుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో కలిపి దాదాపు 30కిపైగా సినిమాల్లో నటించిన తర్వాత సమంతకి కొత్తగా సౌతిండియన్ సినీపరిశ్రమపై కోపం ఎందుకు వచ్చిందో అంటూ కామెంట్స్ వేస్తున్నారు.