సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 13 మే 2017 (10:04 IST)

రాఖీ సావంత్‌పై మళ్లీ లూథియానా కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్ట్

ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌పై మళ్లీ లూథియానా కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రామాయణం రాసిన వాల్మీకి గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను.. అరెస్ట్ వారెంట్ జారీ అయ్యి

ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌పై మళ్లీ లూథియానా కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రామాయణం రాసిన వాల్మీకి గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను.. అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఇంకా ఈ కేసు విచారణను జూన్ రెండో తేదీకి వాయిదా వేస్తూ జుడీషియల్ మెజిస్ట్రేట్ విషయ్ గుప్తా ఆదేశించారు. 
 
కాగా, గత ఏడాది జూలై 9వ తేదీన రాఖీ సావంత్ ఓ ప్రైవేట్ టెలివిజన్ కార్యక్రమంలో వాల్మీకి వర్గాలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తమ మతం మనోభావాలను దెబ్బతీసేలా వున్నాయని లూథియానాకు చెందిన నరిందర్ అదియా స్థానిక కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై గతంలోనే రాఖీ సావంత్‌పై మెజిస్ట్రేట్ కోర్టు మార్చి 9న అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
 
గతంలో కోర్టు ఆదేశం మేర ఇద్దరు పోలీసు అధికారుల బృందం రాఖీసావంత్‌ను అరెస్టుచేసేందుకు ముంబైకి చేరింది. కానీ రాఖీ సావంత్ ‌వెళ్లింది. ముంబయిలో రాఖీ సావంత్ చిరునామాలో ఆమె దొరకకపోవడంతో పోలీసులు తిరిగివచ్చారు.