సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 22 డిశెంబరు 2018 (11:45 IST)

ఎన్టీఆర్ సినిమా ట్రైలర్.. గంటల్లోనే పదిలక్షల వ్యూస్

నందమూరి తారక రామారావు బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న తరుణంలో.. ఆడియో ప్లస్ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం హైదరాబాదులో అట్టహాసంగా జరిగింది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్లో ఎన్టీఆర్ జీవితంలోని కీలక ఘట్టాలను కళ్లకు కట్టినట్లు క్రిష్ చూపించాడు. 
 
ఎన్టీఆర్ నలుగురు కుమార్తెలు ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విడుదలైన కాసేపటికే పది లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయారు. అచ్చం ఎన్టీఆర్‌ను తలపించారు. 
 
కాగా నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, పూనమ్ బజ్వా, మంజిమా మోహన్, మోహన్‌బాబు, రానా దగ్గుబాటి, నందమూరి కల్యాణ్ రామ్, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ, నిత్యామీనన్ తదితరులు నటించిన ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా మాటలు అందించారు. కీరవాణి సంగీతం సమకూర్చారు. క్రిష్ దర్శకత్వం వహించారు. నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి నిర్మాణ సారథ్యం వహించారు.