గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2023 (11:36 IST)

సెప్టెంబర్ 3 నుంచి బిగ్ బాస్ సీజన్ -7.. టైమింగ్స్ ఇవే..

Bigg Boss 7 Season
పాపులర్ రియాల్టీ షోలలో బిగ్ బాస్ ఒకటి. మరో వారం రోజుల్లో ఈ రియాల్టీ షో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 3 నుంచి కొత్త సీజన్ ప్రారంభం కానుంది. సీజన్ 7 లాంచింగ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభం కానుందని స్టార్ మా ప్రకటించింది. స్టార్ మా ఈ సీజన్ టెలికాస్ట్ సమయాలను వెల్లడించింది. 
 
సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతి రాత్రి 9 గంటలకు స్టార్ మాలో బిగ్ బాస్ ప్రసారం కానుంది. శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ఈ షో ప్రసారమవుతుందని ప్రకటించారు. సీజన్-7కి కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఇందుకోసం నాగార్జున 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు పుకారు ఉంది. 
 
బిగ్ బాస్ సీజన్ -7కంటెస్టెంట్స్‌గా చాలా‌మంది యూట్యూబర్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. సీరియల్ నటుడు అమర్‌దీప్ చౌదరితో పాటు అనిల్ గీలా, అంజలి పవన్, ప్రియాంక జైన్, దామిని, సందీప్, పూజా మూర్తి, ప్రియాంక జైన్, రంగస్థలం మహేష్, మొగిలి రేకులు సాగర్ పోటీదారులుగా హౌస్‌లోకి ప్రవేశించనున్నారని టాక్. 
 
జబర్ధస్త్ షో నుండి కంటెస్టెంట్లుగా రియాజ్, బుల్లెట్ భాస్కర్ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే షకీలా, అబ్బాస్, శివాజీతో పాటు మరికొందరు సినీ నటుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కాగా కంటెస్టెంట్స్‌పై త్వరలోనే క్లారిటీ రానుంది.