శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 8 మే 2023 (11:20 IST)

హోమాలతో ఊరు పేరు భైరవకోన ప్రారంభం

sundeep, anilsunkar kavya and others
sundeep, anilsunkar kavya and others
సందీప్ కిషన్, విఐ ఆనంద్, ఏకె ఎంటర్‌ టైన్‌ మెంట్స్, హాస్య మూవీస్ 'ఊరు పేరు భైరవకోన'. ఈ సినిమా  టీజర్ విడుదల రోజు రామనాయుడు స్టూడియోలో నిర్మాతలు 40 మంది పూజారులతో హోమం చేసారు. అనంతరం వారి ఆశీర్వాదాల తర్వాత టీజర్ విడుదల చేసారు. ఆదివారం సందీప్ కిషన్,పుట్టిన రోజు నాడు ఇది జరిగింది. చెన్నై సినిమాల సంప్రదాయం ప్రకారం ఈ వేడుక జరగడం విశేషం. 
 
శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఉన్న గరుడ పురాణం లోని నాలుగు పేజీలు కనిపించకుండా పోయాయని వివరించే  పవర్ ఫుల్ వాయిస్‌ ఓవర్ ‌తో టీజర్ ప్రారంభమవుతుంది. భైరవ కోన   అని పిలవబడే ఈ ఫాంటసీ ప్రపంచంలోకి రావడమే తప్పితే, బయటికి పోవడం వుండదు. హీరో సమాధానాలు వెతకడానికి అక్కడికి చేరుకుంటాడు.
వర్షా బొల్లమ్మ, కావ్య థాపర్‌ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి చోటా కె ప్రసాద్‌ ఎడిటర్‌ గా, ఏ రామాంజనేయులు ఆర్ట్‌ డైరెక్టర్ ‌గా వ్యవహరిస్తున్నారు. భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి డైలాగ్స్ అందించారు.
 
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. మొదటి పాటకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.  రాజేష్  దండా   తో సినిమా చేయడం ఆనందంగా వుంది. ఆనంద్ నాకు మంచి స్నేహితుడు. 'ఊరు పేరు భైరవకోన' లాంటి సినిమా నాతో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో చాలా మంచి విషయాలు, వినోదాత్మక విషయాలు వుంటాయి. ఇలాంటి ఫాంటసీ అడ్వెంచర్ సినిమాలు నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఇందులో నాకు ,హర్ష కి కెమిస్ట్రీ ఎక్స్ టార్డినరిగా వుంటుంది. వర్ష బొల్లమ్మ, కావ్య.. ఇలా అందరూ చాలా చక్కగా నటించారు. ఈ సినిమాకి అన్నిటికన్నా బాగా కుదిరిన విషయం.. అనిల్ గారు. నాకు ఎప్పుడూ తోడుండేది అనిల్ గారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అనిల్ గారు లేకపోతే ఈ సినిమా ఇక్కడి వరకూ వచ్చేది కాదు. టీజర్ మీ అందరికి నచ్చడం ఆనందంగా వుంది. మీ సహకారం ఆశీస్సులు నాకు కావాలి’’ అన్నారు.