ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (17:12 IST)

హిట్ అయినా డబ్బులు వస్తాయని చెప్పలేం : ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకర

Anil Sunkara
Anil Sunkara
యంగ్ హీరోలు డూప్ లేకుండా చేయడానికి ఇష్టపడుతున్నారు. ఒక నిర్మాతగా సేఫ్టీ చూసుకోమని యాక్షన్ కోరియోగ్రఫర్ కి చెప్తాను. మొన్న విజయవాడలో జరిగిన స్టంట్ కి మాత్రం వద్దు అని చెప్పాను. అది హైదరాబాద్ లో అయితే మంచి యాక్షన్ మాస్టర్స్, భద్రత వుంటుందనేది నా ఆలోచన. అఖిల్ మాత్రం అక్కడే చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంలో క్రెడిట్ అంతా అఖిల్ దే. ఏజెంట్ లో అలాంటి చాలా సాహసాలు ప్రేక్షకులు చూస్తారు అని నిర్మాత అనిల్ సుంకర అన్నారు.
 
సురేందర్ రెడ్డి దర్శకత్యంలో ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ ప్రమోషనల్ ట్రెమండస్ రెస్పాన్స్ తో భారీ అంచనాలని పెంచింది  నిర్మాత అనిల్ సుంకర విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
‘ఏజెంట్’ మీ బ్యానర్ లో ప్రతిష్టాత్మక చిత్రం కదా.. ఎక్సయిట్ మెంట్ ఉందా ? ఒత్తిడి ఫీలౌతున్నారా ? 
రెండు రకాలుగా వుంది. నిజాయితీగా చెప్పాలంటే కొంచెం ఒత్తిడి అయితే వుంది. ఫలితం గురించి కాదు. గత నెల రోజులుగా రాత్రి,పగలు యూనిట్ అంతా పని చేస్తోంది. చాలా పెద్ద సినిమా. గంటన్నర సీజీ వర్క్. ప్రతి ఫ్రేం లో సీజీ వుంటుంది. ఇదంతా ఒత్తిడితో కూడుకున్నదే.  
 
‘ఏజెంట్’ ఏ విషయంలో బిగ్ మూవీ ? 
ఏజెంట్ భారీ స్పాన్ వున్న సినిమా.స్పై సినిమా అనగానే అవుట్ డోర్ వుంటుంది. అన్నీ ఫారిన్  లోకేషన్స్. యాక్షన్స్ సీన్స్ కోరియోగ్రఫీ చేసిన తర్వాత, ఎడిటింగ్ చేసిన తర్వాత మార్పులు వస్తే కష్టం. మామూలు ఎంటర్ టైనర్స్, డ్రామా మూవీలలో చిన్న చిన్న తప్పులు వుంటే సర్దుకుపోవచ్చు. ఏజెంట్ లాంటి మూవీకి అది కుదరదు. అందుకే చాలా సమయం తీసుకుంది. 
 
స్పై సినిమాలు చేసినప్పుడు హాలీవుడ్ సినిమాలతో పోలికలు వస్తాయి కదా ? దిన్ని ఎలా చూస్తారు ? 
 జేమ్స్ బాండ్ సినిమాతో పోలిక పెడితే నాకు ఆనందమే. పోలిక పెట్టుకున్నా ఫర్వాలేదు. ఆ స్థాయికి రీచ్ అయ్యామంటే మనం గెలిచినట్లే. 
 
మీరు చాలా బ్లాక్ బస్టర్ సినిమాలని డిస్ట్రిబ్యుషన్ చేశారు.. కానీ ఏజెంట్ ని ఒక్కరికే ఇచ్చేయడానికి కారణం ? 
సమయానికి రిలీజ్ కావాలి, క్యాలిటీ రావాలి.. ఇలా చాలా వుంటాయి. ఒక్కరికి ఇచ్చేస్తే ఆర్ధికపరమైన ఒత్తిడి కూడా వుండదు. 
 
మీరు సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ .. సినిమాని బిజినెస్ లా చూస్తారా ? లేదా ప్యాషన్ తో చూస్తారా? 
బిజినెస్ గా చూడాలని అనుకుంటాను. చివరి నిమిషానికి మాత్రం సినిమా హిట్ కావాలని అనుకుంటాను.  పది కోట్లు కావాలా? సూపర్ హిట్ కావాలా అని నిర్మాతకి అడిగితే.. సినిమా సూపర్ హిట్ కావాలనే కోరుకుంటాడు. అలా అని హిట్ అయిన ప్రతి సినిమాకి డబ్బులు వస్తాయని కూడా చెప్పలేం. 
 
దర్శకుడు సురేందర్ రెడ్డి గారు కోవిడ్ బారిన పడినపుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా వుండేది ? 
ఆయనతో మాట్లాడినపుడు సీరియస్ నెస్ అర్దమైయింది. బూడపెస్ట్ లో ఆయన వున్న చోటా అన్నీ ప్రభుత్వ హాస్పిటల్స్. అందరినీ ఒక రూమ్ లో పడేశారు. ఒకొక్కరుగా చనిపోతున్నారు. నిన్న బెడ్ పక్కన చూసిన వాడు ఈ రోజు వుండటం లేదు. రేపు మనకీ అదే జరగోచ్చు అనే ఫీలింగ్ వచ్చినపుడు .. అది ఊహించడానికే భయానకంగా వుంటుంది. 
 
భోళా శంకర్ అప్డేట్స్ ఏమిటి ? 
యాక్షన్ జరుగుతోంది. ఆగస్ట్ 11న విడుదల చేస్తున్నాం.