`మీటూ’పై మాట్లాడాలంటే ధైర్యం కావాలంటున్న ఓవియా
మీటూపై మాట్లాడాలంటే ధైర్యం కావాలంటూ తమిళ నటి ఓవియా ట్వీట్ చేసింది. హెలెన్ నెల్సన్ ఈమె అసలు పేరు. కానీ సినిమా పేరు ఓవియా. తమిళ, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించింది. ఆమె తమిళ సినిమా `కలవాని` రెండు భాగాల్లో నటించింది. మొదటి భాగం పేరు రాలేదు. రెండోదికూడా ఈమధ్యనే విడుదలైంది. అది కూడా ఆదరణ చూడగొనలేదు. ఆ తర్వాత బిగ్‌బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టింది. ఈ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ షోలో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతాకాదు. పైగా బుల్లితెరపైనే అందాలు ఆరబోసింది.
ఎలక్షన్ల ముందు మోడీ వచ్చి పలు ప్రాజెక్ట్‌లను తమిళనాడులో ప్రారంభించారు. ఆ సమయంలో కొంత వ్యతిరేక వుంది. ఈ సమయంలోనే గోబేక్ మోడీ అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. దాంతో ఆమెపై బి.జె.పి. కార్యకర్తలు అరెస్ట్ చేయమని గొడవ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా మీటూ ఉద్యమం గురించి ట్వీట్ చేసింది. అయితే, అమె మనసులో ఏముందో తెలియదుకానీ, ఆమె ఇలాంటి ట్వీట్ చేయడానికి కారణాలు ఏంటనే విషయంపై కోలీవుడ్‌లో చర్చసాగుతోంది. దీనిపై ఆమెను పరిశ్రమ ఏదైనా చర్య తీసుకుంటుందోమనని పలు మీడియాలు కథనాలు రాస్తున్నారు. అయితే మీటూ ఉద్యమం గురించి మాట్లాడాలంటే ధైర్యం కావాలంది మినహా ఎవరినీ వేలెత్తి చూపలేదు.