ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2024 (15:46 IST)

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

Balayya wishes pailam pillaga team
Balayya wishes pailam pillaga team
'పైలం పిలగా' ఈ వారం సెప్టెంబర్ 20న థియేటర్ లో సందడి చేయబోతున్న సినిమా. 'పిల్ల పిలగాడు' వెబ్ సిరీస్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సాయి తేజ హీరో గా, పుష్ప , పరేషాన్ చిత్రాలతో వెలుగులోకి వచ్చిన పావని కరణం హీరోయిన్ గా, యాడ్ ఫిలిం మేకర్ ఆనంద్ గుర్రం దర్శకత్వంలో తెరకెక్కింది. మొదటి సింగల్ 'సోడు సోడు '  పాటను దర్శకుడు శేఖర్ కమ్ముల గారు రిలీజ్ చేయగా, టీజర్ ని డైరెక్టర్ హరీష్ శంకర్ గారు, ట్రైలర్ ను డైరెక్టర్ వెంకటేష్ మహా గారు లాంచ్ చేసారు . మంచి పాటలు,  ఎంటర్టైనింగ్ టీజర్, ఎంగేజింగ్  ట్రైలర్ ప్రేక్షుకుల దృష్టిలో పడి, సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి.

ఇటీవల బాలయ్య బాబు గారు ఈ  'పైలం పిలగా' చిత్ర టీజర్, ట్రైలర్ ను చూసి మూవీ టీంని ప్రశంసించడం విశేషం. టీజర్, ట్రైలర్ లోని  డైలాగ్స్ ను ఎంజాయ్ చేస్తూ నటీనటులు, సాంకేతిక వర్గం, షూటింగ్ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. నా మొట్ట మొదటి యాడ్ డైరెక్ట్ చేసిన ఆనంద్ గుర్రం మొట్ట మొదటి సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నా అంటూ మూవీ టీం కి అల్ ది బెస్ట్ చెప్పారు.
 
పైసాను ప్రేమించే పిలగాడు, ప్రకృతిని ప్రేమించే పిల్ల. మేఘాల్లో మేడలు కట్టుకోవాలని కలలు కనే మొనగాడు, చెట్టు కింద చిన్న గూడు చాలు అనుకునే  అమ్మాయి మధ్య చిగురించిన ప్రేమ ఒకవైపు, ఎక్కడికైనా సరే,  ఎంత దూరమైనా సరే వెళ్లి కోట్లు సంపాదించి తన ఊళ్ళో కింగ్ అనిపించుకోవాలనే ఆరాటం ఇంకోవైపు, ఈ ఈస్ట్ వెస్ట్ సంఘర్షణని వినోదాత్మకంగా తెలిపే హాస్యభరిత వ్యంగ చిత్రం 'పైలం పిలగా'.
 
హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ లో  మొదటి చిత్రం 'పైలం పిలగా' ను  రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. డబ్బింగ్  జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. యశ్వంత్ నాగ్ ఆరు అద్భుతమైన పాటలతో మెలోడియస్ సంగీతాన్ని అందించారు. కెమెరా సందీప్ బద్దుల, ఎడిటింగ్ రవితేజ, శైలేష్ దరేకర్, స్టైలిస్ట్ హారిక పొట్ట, లిరిక్స్ ఆనంద్ గుర్రం, అక్కల చంద్రమౌళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ ఒడ్నాల పనిచేసిన ఈ చిత్రానికి రవి వాషింగ్టన్, కృష్ణ మసునూరి, విజయ్ గోపు సహా నిర్మాతలుగా వ్యవహరించారు.