సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2024 (12:00 IST)

అల్లు అర్జున్ ఫ్యాన్ పేరుతో టీనేజ్ యువత చేసిన వెర్రి వేషాలు

Teenage Fan Crazy atitude
Teenage Fan Crazy atitude
సినీ హీరోలకు అభిమానులు ఒక్కోసారి వెర్రితలలు వేస్తుంది. ముందు వెనకా చూడకుండా ముక్కుసూటిగా వారు ఏమనుకుంటే అదే చేయాలనే పిచ్చితనంతో కొన్ని పనులు చేస్తుంటారు. దీనికంతటికీ కారణం ఇప్పటి టీనేజ్ యువతలో మన సంస్క్రుతి సంప్రదాయాల గురించి తెలియకపోవడం, పెద్దలు చెప్పినా చెవిని ఎక్కించుకోకపోవడంతోపాటు సోషల్ మీడియా పేరుతో యూట్యూబ్ కల్చర్ కు బానిసలు కావడం జరుగుతుంది. 
 
ఇలాంటి సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని ఓ ప్రాంతంలో జరిగింది.  వివరాల్లోకి వెళితే.. వినాయకచవితినాడు అక్కడ టీనేజ్ బ్యాచ్ వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేసి మైకులలో ప్రచారం చేశారు. అయితే అసలు వినాయకుడి ఒడిలో అల్లు అర్జున్ ఫొటోలాంటి బొమ్మను పెట్టారు. ఇరువైపుల అల్లు అర్జున్ ఫొటోలు డైరెక్ట్ గా పెట్టేశారు. ఇలా పెట్టి సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసుకున్నారు. తమకునన యూట్యూబ్ లో ప్రచారం చేసుకున్నారు. దాంతో వారిని నానా బూతులు తిట్టడమేకాకుండా, వారి తల్లిదండ్రులను కూడా ఏకిపారేశారు. 
 
ఇది ఆనోటా ఈనోటా తెలిసిన లోకల్ మీడియా ప్రత్యేకంగా వచ్చి ఈ టెంట్ దగ్గర వారిని అడిగింది. దాంతో వారు నిర్మొహమాటంగా మాట్లాడుతూ, మేం అల్లు అర్జున్ అంటే పడిచచ్చిపోతాం. అందుకే ఇలా పెట్టాం. ఇలా పెట్టాలని కూడా మాకు తెలీదు. కానీ సోషల్ మీడియాలో వచ్చిన పచ్చి బూతులు చూశాక మేం ఆ ఫొటోలను తీయాలనుకున్నాం. అన్నారు. మరి మీ తల్లిదండ్రులు ఏమీ అనలేదా? అంటే.. అలా పెట్టకూడదు అని మందలించారు. కానీ అప్పటికే మేం ఫాం కావాలని సోషల్ మీడియా పెట్టిన పోస్ట్ లతోపాటు ఊరిలోని జనాలు కూడా తిట్టారు. అందుకే మేం ఇప్పుడు అల్లు అర్జున్ ఫొటోను తీసేయాలనుకుంటున్నాం అని బదులిచ్చారు. 
 
టీనేజ్ పిల్లలు ఇలా చేయడం పట్ల పెద్దలు సరిగ్గా పిల్లలను పెంచకపోవడంతోపాటు, వారికి సరైన విద్యావిధానం కూడా లేకపోవడం మన సమాజంలో వున్న ప్రధాన లోపంగా నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. 

అయితే ఇక్కడ కొసమెరుపు ఏమంటే.. ఇలాంటి ఐడియా మీకు ఎందుకు వచ్చిందంటే.. గతంలో ప్రభాస్ ఫొటోలు పెట్టి కొందరు చేయడం చూశాం. అందుకే మేం అల్లు అర్జున్ పెట్టామని చెప్పడం విశేషం.