శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 27 జూన్ 2024 (16:52 IST)

భగభగ మండే సూర్యుడి కిరణాల నుంచి పవన్ కల్యాణ్ ఆర్ట్, ట్రెండ్ సెట్ చేసిన అభిమాని (Video)

pawan kalyan
సినీ నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానులు గురించి వేరే చెప్పక్కర్లేదు. పవన్ కల్యాణ్ అంటే ప్రాణం ఇచ్చేస్తారు. ఆయనకు రాష్ట్రంలోనే కాదు దేశవిదేశాల్లో సైతం అభిమానులు వున్నారు. ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా వుంటారు. తాజాగా శ్రీకాకుళానికి చెందిన జనసైనికుడు ఓ ఫీట్ చేసాడు.
 
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రాన్ని సూర్యుడి కిరణాల ద్వారా లెన్స్ ఉపయోగించి చిత్రీకరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.