గురువారం, 21 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 26 జూన్ 2024 (17:39 IST)

వారాహి అమ్మవారి దీక్ష: పూజానంతరం డిప్యూటీ సీఎం పవన్ చెప్పులు వేసుకోవచ్చా? లేదా?

pawan kalyan
వారాహి అమ్మవారి దీక్ష చేస్తూ...
కోరిన కోర్కెలు తీర్చే తల్లి, శత్రువులకు సింహ స్వప్నం, ఆటంకాలను పటాపంచలు చేసే దేవి వారాహి దీక్ష చేస్తున్నారు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఐతే ఆయన తన కార్యాలయానికి చెప్పులు వేసుకుని రావడంపై పెద్ద చర్చను లేవదీస్తున్నారు చాలామంది. ఇంతకీ డిప్యూటీ సీఎం అలా చెప్పులు వేసుకు రావడం తప్పా? అంటే కాదనే అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.
 
వారాహి అమ్మవారి దీక్షాస్థలి వద్ద మాత్రమే పాదరక్షలు ధరించరాదు. అక్కడ అమ్మవారికి త్రికరణశుద్ధితో పూజాది కార్యక్రమాలు నిర్వహించాలి. ఎలాంటి ఇతర వ్యాపకాలకు తావుండకూడదు. పూజాది కార్యక్రమాలు ముగిసాక ప్రతి మనిషికి సాధారణ రోజువారీ కార్యక్రమాలు వుంటాయి. కనుక బయటకు వెళ్లేటప్పుడు, కార్యాలయంలో విధులు నిర్వహించేటపుడు పాదరక్షలు వేసుకోవచ్చు.
 
pawan kalyan
కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి...
ఐతే డిప్యూటీ సీఎం పాదరక్షలు వేసుకున్నారంటూ గత రెండు రోజులుగా దీనిపై పెద్ద దుమారమే జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్యాత్మికపరంగా పూజలు, యాగాలు చేయడం ఇవాళ కొత్తకాదు. ఎన్నో ఏళ్లుగా ఆయన పద్ధతి ప్రకారం యాగాలు, క్రతువులు ఆధ్యాత్మికపరమైన నియమానాలను అనుసరించి చేస్తున్నారు. కనుక చెప్పులు గురించి మాట్లాడేవారు ఇకనైనా మానుకోవాలని హితవు పలుకుతున్నారు.