మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 8 మార్చి 2021 (16:06 IST)

మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా వకీల్ సాబ్ పోస్ట‌ర్‌

Vakel sab, womens day
పవన్ కళ్యాణ్ క‌ళ్యాణ్ న‌టించిన ‘వకీల్ సాబ్’ సినిమా గురించి ఏదో వార్త వ‌స్తూనే వుంది. ఈ సినిమా త‌ర్వాత ఆయ‌న మ‌రో సినిమాకూడా చేస్తున్నాడు. కాగా, సోమ‌వారం అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు అంజలి, అనన్య, నివేదా థామస్‌తో కలిసి ఉన్న ఫోటోను విడుదల చేసింది. మహిళ ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కింది. అందుకే ఈరోజు ఆ స్టిల్‌ను విడుద‌ల చేశారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం రూపొందుతోంది. ఇది అమితాబ్ బచ్చన్ నటించిన ‘పింక్’ మూవీకి రీమేక్. తెలుగు నేటివిటీకి హీరో ఇమేజ్‌కు సంబంధించిన కొంత భాగాన్ని మార్చారు.  శృతి హాసన్ హీరోయిన్‌గా న‌టించింది. సినిమాను ఏప్రిల్ 9న విడుదల చేస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జీ సినిమాస్ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుంది. ఓటీటీ అమెజాన్‌కు ఇవ్వ‌నున్నారు.