శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: ఆదివారం, 7 మార్చి 2021 (20:48 IST)

జాతి నిర్మాణంలో మహిళామణులదే కీలక భూమిక: గవర్నర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆంద్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ మహిళలు దేశ నిర్మాణం, జాతీయ సమగ్రత, శాంతిసామరస్యాలను పెంపొందించటంలో ఎల్లప్పుడూ కీలక భూమికను పోషిస్తూ వచ్చారని ప్రశంసించారు.
 
మహిళలు ఎప్పుడూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కరోనాపై పోరులో సైతం ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, వైద్యులతో పాటు మహిళలు సైతం ముందు వరుసలో ఉన్నారని ప్రస్తుతించారు. భారత సామాజిక స్దితిగతుల మేరకు సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్న వారు ఎంతో సహనంతో తమ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నారని, ఇది దేవుడు వారికి ఇచ్చిన గొప్ప బహుమతి అని గవర్నర్ కొనియాడారు.
 
జాతి నిర్మాణంలో మహిళలు తిరుగులేని నాయకత్వ పాత్ర పోషిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వివరించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన వెలువడింది.