బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2017 (14:22 IST)

'కొడకా.. కోటేశ్వరరావు' అంటున్న పవన్ కళ్యాణ్

హీరో పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం వచ్చే నెల పదో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనెల 26వ తేదీన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.

హీరో పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం వచ్చే నెల పదో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనెల 26వ తేదీన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. రీసెంట్‌గా చిత్ర ఆడియోను రిలీజ్ చేశారు. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతంలో రూపొందిన ఐదు పాటలు మ్యూజిక్ లవర్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
 
ఈ చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ ఓ పాటపాడారు. పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'అత్తారింటికి దారేది' చిత్రంలో కూడా 'కాటమరాయుడా కదిరీ నరసింహుడా' అంటూ పవన్ పాటపాడగా, ఇది ఎంతగానో ప్రేక్షకాధారణ పొందింది. అలాగే, 'అజ్ఞాతవాసి' చిత్రంలోనూ పవన్ "కొడకా.. కోటేశ్వరరావు" అంటూ ఓ పాటపాడారట. ఈ పాటను ఈనెల 31వ తేదీన రిలీజ్ చేయనున్నారు. 
 
'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్ పాడిన పాటకు వచ్చిన రెస్పాన్స్‌ను చూసి తాజా చిత్రంలోనూ పవన్‌తో పాటపాడించినట్టు తెలుస్తోంది. ఈ పాట రికార్డింగ్ గురువారం పూర్తయింది. కాగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ కథానాయికలుగా కాగా, సీనియర్ నటి ఖుష్బూ కీలక పాత్రలో నటిస్తున్నారు.