సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (18:32 IST)

పూజా హెగ్దే.... నీ ట్వీట్‌కి అతడి ఉద్యోగం ఊడుతుంది, నువ్వు మాత్రం 7 స్టార్ హోటల్లో వుంటావ్

pooja hegde
పూజా హెగ్దె
టాప్ స్టార్ పూజా హెగ్దెకి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న గో ఇండిగో విమానంలో సదరు సిబ్బందిలో ఒకరైన విపుల్ నకాషే అనే వ్యక్తి తమ పట్ల మొరటుగా ప్రవర్తించాడని, ఇలాంటి అనుభవాన్ని తను ఎదుర్కోలేదని ట్వీట్ చేసింది.

 
పూజా హెగ్దే ట్వీట్ పైన నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది... మా హీరోయిన్ పట్ల అనుచితంగా ప్రవర్తించింది ఎవరూ అంటూ బాలయ్య చేత్తో కత్తిపట్టుకుని ఆవేశంగా వస్తున్న జిఫ్ వీడియోను పోస్ట్ చేసి ఫన్నీ ఎమోజీ జోడించాడు.

 
ఇక మరికొందరైతే... పూజా... మీరు పెట్టిన పోస్టుకి అతడి ఉద్యోగం ఊడుతుంది. కనీసం అది ఆలోచించావా... అతడి పైన కుటుంబం ఆధారపడి వుంటుంది. ఉద్యోగం ఊడితే అతడి కుటుంబం ఏమైపోతుంది? అతడి ఉద్యోగం ఊడి ఇంట్లో కూర్చుంటే నువ్వు మాత్రం 7 స్టార్ హోటల్లో హాయిగా వుంటావు అంటూ కామెంట్ పెట్టాడు.