శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (17:59 IST)

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెస్మ‌రైజ్ చేసిన ఐశ్వ‌ర్య‌, పూజా హెగ్డే

Aishwarya Rai Bachchan, Pooja Hegde
Aishwarya Rai Bachchan, Pooja Hegde
ఈ ఏడాది జ‌రిగిన 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై దీపికా పదుకొణె, ఐశ్వర్యరాయ్ బచ్చన్, పూజా హెగ్డేలు  గౌన్లలో మెస్మరైజ్ చేశారు. ఐశ్వ‌ర్య ధ‌రించిన  డ్రెస్ అంద‌రినీ అల‌రించింది. ఈ సంద‌ర్భంగా ఆమెను చూసిన అభిమానులు, నిర్వాహ‌కులు ఆమె అందంలో మార్పులేద‌ని కితాబిచ్చారు.
 
Pooja Hegde
Pooja Hegde
పూజా హెగ్డే ఈ సంద‌ర్భంగా ప‌లు విష‌యాల‌ను తెలియ‌జేసింది. అక్క‌డ మీడియాతో మాట్లాడుతూ, బాలీవుడ్‌, సౌత్ అనే తేడాలు లేకుండా సినిమారంగంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ద‌క్షిణాది సిని ప‌రిశ్ర‌మ వ‌ల్ల ఎంతోమంది వెలుగులోకి వ‌చ్చారు. నాకు ఎక్కువ‌గా పేరు ప్ర‌ఖ్యాతులు సౌత్‌లో ద‌క్కాయ‌ని ఇక్క‌డ సినీప‌రిశ్ర‌మ ప్ర‌పంచం కీర్తించే స్థితిలో వుంద‌ని తెలియ‌జేసింది. క‌థ‌ల‌లో వైవిధ్యం వుండే పాత్ర‌ల‌ను పోషిస్తున్న‌ట్లు ఆమె చెప్పింది. ప్ర‌స్తుతం హిందీలో రెండు తెలుగులో ఓ సినిమా చేస్తున్న‌ట్లు తెలిపింది.