బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 4 జూన్ 2022 (18:10 IST)

పూజా హెగ్డే రాక‌తో జ‌న‌గ‌ణ‌మ‌ణ షూటింగ్ ప్రారంభం

Pooja Hegde, Puri Jagannath, Charmi Kaur and others
Pooja Hegde, Puri Jagannath, Charmi Kaur and others
సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం  జేజీఎం  (జ‌న‌గ‌ణ‌మ‌ణ). బిగ్గెస్ట్ యాక్షన్-డ్రామా పాన్ ఇండియా మూవీగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కాబోయే  ఈ చిత్రం హై వోల్టేజ్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. దర్శకుడు పూరీ జగన్నాధ్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఇది.
 
పూరీ కనెక్ట్స్,  శ్రీకరా స్టూడియోస్ ప్రొడక్షన్‌లో చార్మి కౌర్, వంశీ పైడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో  పూజా హెగ్డే కథానాయిగా చేరారు. విజయ్ దేవరకొండతో పూజాకి ఇది మొదటి చిత్రం.
 
పూజా హెగ్డే యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రం మొదటి షూట్ షెడ్యూల్‌ ఈ రోజు ప్రారభించారు. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూట్ షెడ్యూల్ ముంబైలో మొదలై పలు అంతర్జాతీయ ప్రదేశాలలో జరుగుతుంది. షూటింగ్ ప్రారంభం సందర్భంగా మేకర్స్ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు.
దర్శకుడు పూరి జగన్నాధ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించబోతున్నారు. అలాగే సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ లక్ష్యంగా ఈ సినిమా కోసం సిద్ధమయ్యారు.
 
పూరీ జగన్నాథ్ రచన దర్శకత్వం వహిస్తున్న  'జేజీఎం' 3 ఆగస్ట్ 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తారాగణం: విజయ్ దేవరకొండ, పూజా హెగ్డే
సాంకేతిక విభాగం:\ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరీ జగన్నాథ్ 
నిర్మాతలు: ఛార్మి కౌర్ , వంశీ పైడిపల్లి
బ్యానర్లు: పూరీ కనెక్ట్స్ & శ్రీకర స్టూడియోస్