సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2023 (14:15 IST)

'సలార్' రిలీజ్.. అభిమాని మృతి.. కరెంట్ తీగలు తగిలి..

Sallar-prabhas
ప్రభాస్ నటిస్తున్న 'సలార్' రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రుతతో ఎదురుచూశారు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రెండు పార్టులుగా రూపొందగా.. నేడు మొదటి భాగం రిలీజ్ అయ్యింది. భారీ కట్ అవుట్స్, డీజేలు, టపాసులతో థియేటర్స్ దగ్గర పండుగా వాతావరణం కనిపిస్తుంది. 
 
ఈ సినిమా రిలీజ్ సెలబ్రేషన్స్‌లో ఒక అభిమాని మృతి చెందడం అందర్నీ కలిచివేస్తుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రంగ థియేటర్ వద్ద బాలరాజు అనే అభిమాని సలార్ మూవీ ఫ్లెక్సీ కడుతున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. 
 
ఫ్లెక్సీ ఇనుప ఫ్రేమ్ అక్కడే ఉన్న కరెంట్ తీగలకు తాకడంతో బాలరాజు అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. కరెంటు తీగలు తక్కువ హైట్‌లో ఉండడమే ప్రమాదానికి కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ విషయం తెలియడంతో తోటి ప్రభాస్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.