ఆదివారం, 17 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (11:06 IST)

గెటౌట్ అనేశారు.. స్టూడియో బయటకొచ్చి బోరున ఏడ్చేశాను... ప్రకాష్ రాజ్

తెలుగు చిత్రపరిశ్రమలోనే కాకుండా కన్నడ, తమిళ, కేరళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు ప్రకాష్ రాజ్. భాషతో పని లేకుండా, తన డబ్బింగ్ తానే చెప్పుకుంటారు. తెలుగు చిత్రపరిశ్రమలోకి వచ్చిన కొత్తల్లో ఈయనకు సాయికుమార్ తమ్ముడు రవి డబ్బింగ్ చెప్పేవారు. ఆ తర్వాత ఆయనే తెలుగు నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. 
 
దీనిపై ప్రకాష్ రాజ్ ఓ కార్యక్రమంలో స్పందిస్తూ, మనకు భాష మాట్లాడకపోతే  పెర్ఫార్మెన్స్‌ కనిపించదు. మొదటి తెలుగు సినిమా సాయికుమార్‌ తమ్ముడు రవి డబ్బింగ్‌ చెప్పారు. ఓ చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం స్టూడియోలో డబ్బింగ్‌ పనులు జరుగుతున్నప్పుడు.. ఎంతసేపు అలా కాదు, ఇలా కాదు అని చెబుతుంటే, గెటౌట్‌ అనేశారు. స్టూడియో బయటకొచ్చి ఏడ్చేశాను. నాకు భాష నేర్చుకోవడం, సాహిత్యం చదవడం ఇష్టం. భాష నేర్చుకోవడమంటే వారి సంస్కృతిని గౌరవించినట్లు అనిపిస్తుంది అని చెప్పుకొచ్చారు.