సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (17:27 IST)

నింద దర్శక, నిర్మాతని అభినందించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు

Rajesh Jagannadham,  Dil Raju,
Rajesh Jagannadham, Dil Raju,
వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’ అనే చిత్రం థియేటర్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ మరింత ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఓటీటీ ఆడియెన్స్‌ని సైతం నింద ఆకట్టుకుంది. ఈ మూవీని ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
 
రాజేష్ జగన్నాధం మొదటి ప్రయత్నంతోనే అటు నిర్మాతగా, ఇటు దర్శకుడిగా తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. ఆయన విజన్, మేకింగ్‌కు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫిదా అయ్యారు. రీసెంట్‌గా ఆయన నింద మూవీని వీక్షించారు. అనంతరం దర్శక నిర్మాత రాజేష్‌తో దిల్ రాజు ప్రత్యేకంగా ముచ్చటించారు. సినిమా బాగుందని, బాగా తీశారని ఆయన్ను మెచ్చుకున్నారు.
 
రాజేష్ జగన్నాధం ప్రస్తుతం తన ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద ఫోకస్ పెట్టారు. త్వరలోనే మరో విభిన్న కథాంశంతో, కొత్త కాన్సెప్ట్‌తో ఆడియెన్స్ ముందుకు రానున్నారు. తన రెండో సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.