శుక్రవారం, 28 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 24 జూన్ 2024 (18:26 IST)

వరుణ్ సందేశ్ నింద కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల జోరు

Varun Sandesh
Varun Sandesh
ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం నింద. వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో అద్భుతమైన నటనను కనబర్చారు. జూన్ 21న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి మంచి టాక్, రివ్యూలు వచ్చాయి. దర్శకుడు రాజేష్ జగన్నాధం తన తొలి ప్రయత్నంలో సఫలమయ్యారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో వచ్చిన నింద ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. 
 
వరుణ్ సందేశ్  తనలోని కొత్త కోణాన్ని చూపించి నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. వరుణ్ సందేశ్‌కి నింద పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ మూవీ అయిందని ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌ని ఎంచుకున్నందుకు వరుణ్ సందేశ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.
 
మంచి వసూల్లతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ వారంలో రిలీజ్ అయిన అన్ని చిత్రాల్లోకెల్లా నింద దూసుకుపోతోంది. వరుణ్ సందేశ్ కెరీర్‌లో హయ్యస్ట్ ఓపెనింగ్స్‌ సాధించింది. ఈ వీకెండ్‌లో తెలుగు రాష్ట్రాల్లో నెం.1 వసూళ్లు సాధించిన చిత్రంగా నింద నిలవనుంది. మంచి బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా పెట్టుబడిని రికవరీ చేస్తూ కమర్షియల్‌గా హిట్‌ అవుతుందని ట్రేడ్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
 
అన్నీ, శ్రేయ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై ఇతర ముఖ్య తారాగణంగా నటించిన ఈ చిత్రానికి రమీజ్ నవీత్ కెమెరా, సంతు ఓంకార్ సంగీతం అందించారు. అనిల్ కుమార్ ఎడిటింగ్ చేశారు.