1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 20 జూన్ 2024 (16:54 IST)

ది కానిస్టేబుల్"గా వరుణ్ సందేశ్ నటరూపం

Varun Sandesh
Varun Sandesh
వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వం లో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం "ది కానిస్టేబుల్".  వరుణ్ సందేశ్ కి జోడిగా మధులిక వారణాసి హీరోయిన్ గా తొలిపరిచయం కానున్నారు. ఈ సినిమా బుధవారం నాటితో హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసుకుంది. .
 
ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ,  "సినిమా షూటింగ్ అంతా చాలా హాయిగా సాగింది. త్వరలో కానిస్టేబుల్ పాత్ర లో కొత్తకోణంలో, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల  ముందుకు వస్తున్నాను" అని చెప్పారు.
 
నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ,  "కథ, కధనాలు అద్భుతంగా అమరిన చిత్రమిది. పోలీస్ పాత్రలో వరుణ్ సందేశ్ ఆకట్టుకుంటారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి" అని పేర్కొన్నారు.
 
దర్శకుడు ఆర్యన్ సుభాన్ SK మాట్లాడుతూ, సస్పెన్స్ క్రైమ్  థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో వరుణ్ సందేశ్ నట విశ్వరూపం చూడవచ్చు. త్వరలో ఈ చిత్రం పాటలను, మోషన్ పోస్టర్ ను విడుదల చేస్తామని అన్నారు.
 
 ఈ చిత్రంలో దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా; హజరత్ షేక్ (వలి), సంగీతం :సుభాష్ ఆనంద్, ఎడిటింగ్: వర ప్రసాద్, B. G. M :గ్యాని, ఆర్ట్: వి. నాని, పండు, మాటలు :శ్రీనివాస్ తేజ, పాటలు: రామారావు, శ్రీనివాస్ తేజ, సహనిర్మాత: బి నికిత జగదీష్, నిర్మాత; బలగం జగదీష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం; :ఆర్యన్ సుభాన్ SK.