1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 17 జూన్ 2024 (11:48 IST)

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

Nikhil Siddharth with Varun Sandesh ninda team
Nikhil Siddharth with Varun Sandesh ninda team
వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’ అనే చిత్రాన్ని ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. మైత్రీ మూవీస్ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తోంది. గత రాత్రి  నింద మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్ సిద్దార్థ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
 
అనంతరం నిఖిల్ సిద్దార్థ్ మాట్లాడుతూ.. ‘ ‘నింద’ని ఆడియెన్స్ ముందుకు తీసుకెళ్లాలి. జూన్ 21న ఈ చిత్రం రాబోతోంది. నా కెరీర్‌లో స్వామిరారా, కార్తికేయ ఎలా పడిందో.. నింద అనేది వరుణ్ కెరీర్‌కు ఓ మైల్ స్టోన్‌లా మారాలి. నింద మూవీని అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. రాజేష్ గారి గురించి అందరూ మాట్లాడుకుంటారు. నింద అనే మూవీతో వరుణ్ సందేశ్‌కు హిట్ రాబోతోంది. చాలా క్వాలిటీతో తెరకెక్కించారు. జూన్ 21న నింద మూవీని అందరూ చూడండి. అందరూ సినిమాను చూసి పెద్ద సక్సెస్ చేయాలి’ అని అన్నారు.
 
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ‘నిఖిల్ ఎదుగుదలను చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. నిఖిల్, నేను కలిసి 2007లో హ్యాపీడేస్ చేశాం. అప్పుడు నా వయసు 17. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఇలా ఒకే స్టేజ్ మీదకు వచ్చాం. దాదాపు నా సగం లైఫ్ సినిమా ఇండస్ట్రీలోనే గడిచింది. గత ఏడేళ్లుగా నా భార్య వితిక నాకు అండగా ఉంటూ వచ్చింది. ఆమెకు నేను ఎంత చేసినా, ఏం చేసినా తక్కువే అవుతుంది. నింద నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాను. కానీ నాకెప్పుడూ ఇలా అనిపించలేదు. ఎంతో కంఫర్టబుల్‌గా జీవితాన్ని గడుపుతున్న రాజేష్ తన ఫ్యాషన్‌తో ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించారు. ఆయనకు తన కథ మీద చాలా నమ్మకం ఉంది. ఎంతో గట్స్, కాన్ఫిడెన్స్ తో నిర్మించారు. టీం అంతా కూడా సింక్‌లో ఉండి పని చేసింది. అందరూ వంద శాతం ఎఫర్ట్స్ పెట్టారు. ఈ సినిమాను ఇండస్ట్రీలోని కొంత మందికి చూపించాం. ఆ తరువాత మాలో మరింత పాజిటివిటీ పెరిగింది. మైత్రీ వారు మా మూవీని రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రయాణంలో రాజేష్ గారు నాకు ఓ బ్రదర్‌లా మారిపోయారు. తక్కువ రోజుల్లోనే షూటింగ్‌ను పూర్తి చేశాం. నాకు గాయమైనా కూడా రాజేష్ గారి కోసమే షూటింగ్ చేశాను. ఈ చిత్రం తరువాత రాజేష్ గారు ప్రాజెక్టులు చేస్తూనే ఉంటారు. ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడిగా, మంచి దర్శకుడిగా, నిర్మాతగా నిలబడతారు. రమీజ్ కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటుంది. సాంతు ఓంకార్ మ్యూజిక్, ఆర్ఆర్ ఎంతో ఇంటెన్స్‌గా బాగుంటుంది. అనిల్ గారి ఎడిట్ సూపర్బ్‌గా ఉంటుంది.  శ్రేయా, అన్నీ, మధు అందరూ చక్కగా నటించారు. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, ఏమైంది ఈవేళ.. నెక్స్ట్ ‘నింద’ అని గర్వంగా చెప్పుకోగలను. మా బామ్మ ఈ మూవీ చూశారు. అన్ని వర్గాల ఆడియెన్స్‌కు ఈ మూవీ నచ్చుతుంది. జూన్ 21న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.
 
 వితిక షెరు మాట్లాడుతూ.. ‘మా ఆయన ప్రతీ సారి ఈవెంట్‌కు రమ్మంటారు. కానీ మొదటి సారి నాకు నింద కోసం రావాలనిపించింది. వరుణ్ ఫెయిల్యూర్ యాక్టర్ కాదు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి గత 17 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు.. ఆయనెలా ఫెయిల్యూర్ యాక్టర్ అవుతారు. ఆయన ఏ చిత్రం చేసినా వంద శాతం కష్టపడతారు. ఏదొక రోజు గట్టిగా కొడతారు. దర్శక నిర్మాత రాజేష్ గారు తీసిన నింద పెద్ద హిట్ అవ్వాలి. నిఖిల్ ఈ ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. జూన్ 21న రాబోతోన్న ఈ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.
 
దర్శక, నిర్మాత రాజేష్ జగన్నాథం మాట్లాడుతూ, ఈ మూవీ అవుట్ పుట్ చూశాక నాకు చాలా సంతృప్తి కలిగింది. అదే నేను సాధించిన విజయం అనిపించింది. చిన్నారావు గారు నా వెన్నంటే ఉండి నడిపించారు. శిరీష నాకు రైటింగ్‌లో హెల్ప్ చేశారు. నా డైరెక్షన్ టీంకు థాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ సాంతు, ఎడిటర్ అనిల్, కెమెరామెన్ రమీజ్ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్స్. అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్లకు థాంక్స్. నటించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అందరూ వారి వారి పాత్రలతో ఆడియెన్స్‌కు గుర్తుండిపోతారు. ఈ చిత్రంతో నాకు వరుణ్ లాంటి మంచి బ్రదర్ దొరికాడు. అతను చాలా మంచి వ్యక్తి. హిట్లు లేనప్పుడే మనిషి వ్యాల్యూ తెలుస్తుంది. ఆయన ఈ మూవీతో కమ్ బ్యాక్ ఇస్తాడు. నింద మూవీతోనే దానికి నాంది పడుతుంది. జూన్ 21న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.
 
 శ్రేయా రాణి మాట్లాడుతూ.. ‘నాకు ఇది మొదటి సినిమా. నాకు ఇంత మంచి కారెక్టర్ ఇచ్చిన రాజేష్ గారికి థాంక్స్. నన్ను ఓ ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకున్నారు. వరుణ్ సందేశ్ సర్ చాలా మంచి వ్యక్తి. ఆయన నన్నెంతో సపోర్ట్ చేశారు అన్నారు.
 
 నటి అన్నీ మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు వచ్చిన నిఖిల్ గారికి థాంక్స్. నాకు సుధ లాంటి మంచి పాత్రను ఇచ్చిన రాజేష్ గారికి థాంక్స్. ఆయన ఎంతో సైలెంట్‌గా ఉంటారు. అరుధ్ ధళై గారు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, క్యాస్టింగ్ డైరెక్టర్‌గా, నటుడిగా పని చేశారు. సాంతు ఓంకార్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. వరుణ్ సందేశ్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది.  అని అన్నారు.
 
 మైత్రీ మూవీస్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘రాజేష్ నాకు ఈ సినిమాను చూపించారు. చాలా కొత్తగా తీశారు. నెక్స్ట్ సీన్ ఏంటో కూడా చెప్పలేం. అంత బాగా తీశారు. వరుణ్ సందేశ్ గారికి కమ్ బ్యాక్ అవుతుంది. కొత్త బంగారు లోకం మా థియేటర్లో 50 రోజులు ఆడింది. ఇప్పుడు వరుణ్ సందేశ్  కమ్ బ్యాక్ ఇవ్వాలని, ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.