శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 జూన్ 2018 (10:23 IST)

2017 నవంబరు 8న యూఎస్‌కెళ్లిన హీరోయిన్.. స్టార్‌నైట్ ఎగ్గొట్టి వ్యభిచారం... ఎవరామె?

అమెరికాలోని చికాగోలో వెలుగు చూసిన వ్యభిచార దందాలో పాల్గొన్న హీరోయిన్ల పేర్లు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా స్టార్‌నైట్, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో అమెరికా వెళ్లిన పలువురు హీరోయిన్

అమెరికాలోని చికాగోలో వెలుగు చూసిన వ్యభిచార దందాలో పాల్గొన్న హీరోయిన్ల పేర్లు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా స్టార్‌నైట్, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో అమెరికా వెళ్లిన పలువురు హీరోయిన్లు ఆ కార్యక్రమాలకు డుమ్మాకొట్టి.. వివిధ స్టార్ హోటళ్ళలో వ్యభిచార వృత్తిలో పాల్గొన్నారు. 
 
ముఖ్యంగా, గత 2017 నవంబరు 8వ తేదీన ఆటా (అమెరికా తెలుగు అసోసియేషన్), తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (టీఏఎస్)లు సంయుక్తంగా ఓ స్టార్‌నైట్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఓ టాలీవుడ్ హీరోయిన్ యూఎస్ ఫ్లైటెక్కింది. కానీ, ఆమె స్టార్‌నైట్‌కు డుమ్మాకొట్టి... చికాగోలోని ఓ స్టార్ హోటల్‌లో పడుపు వృత్తిలో నిమగ్నమైంది. ఈ విషయాన్ని చికాగో కోర్టుకు స్థానిక పోలీసులు సమర్పించిన చార్జిషీటులో పేర్కొన్నారు. 
 
దీంతో ఆ హీరోయిన్ ఎవరన్నదానిపై ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. మరోవైపు, హీరోయిన్లను అమెరికాకు రప్పించేందుకు వీసాలు ఇవ్వాలంటూ యూఎస్ కౌన్సెల్ జనరల్‌కు ఆటా (అమెరికా తెలుగు అసోసియేషన్) సిఫార్సు చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.