సంబంధిత వార్తలు
- వెకేషన్ కోసం ఫ్యామిలీతో జపాన్ వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్
- గోడపై హాయిగా నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటున్న పెద్దపులి.. ఎక్కడ?
- దేవుడి దయ వల్ల ఓడిపోవడమే మంచిదైంది : దగ్గుబాటి వెంకటేశ్వర రావు
- ఉద్యోగులను తొలగించిన పేటీఎం... దాదాపు వెయ్యిమందిని...
- ఉదయగిరి టిక్కెట్‌ను అమ్మకానికి పెట్టారు : సీఎం జగన్‌పై వైకాపా రెబెల్ ఎమ్మెల్యే
వ్యూహం.. డిసెంబర్ 29న రిలీజ్.. ఆర్జీవీ ఆఫీసు ముందు టీడీపీ ఆందోళన
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. ఇటీవలే విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వ్యూహం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదలను ఆపాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. థియేటర్లతోపాటు, ఓటీటీల్లోనూ సినిమా రిలీజ్ చేయొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వ్యూహం రిలీజ్ డేట్ మార్చారు వర్మ. ఈ చిత్రాన్ని ఈనెల 27న కాకుండా.. డిసెంబర్ 29న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు వర్మ. ఈ క్రమంలోనే నిన్న ఆర్జీవీ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు టీడీపీ కార్యకర్తలు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిలింనగర్లో టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వర్మ. ఈ ఘటనపై నిర్మాత దాసరి కిరణ్ మాట్లాడుతూ.. సినిమాను సినిమాగానే చూడాలని అన్నారు. ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫై చేసిన తర్వాత కూడా టీడీపీ కార్యకర్తలు ఇలా దాడులు చేయడం సరికాదని చెప్పారు.
“దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ దగ్గర టీడీపీ నేతల గూండాయిజం”
— YSR Congress Party (@YSRCParty) December 25, 2023
ఫిలింనగర్ లో ఆర్జివి డెన్ దగ్గర వ్యూహం పోస్టర్స్ ను కాల్చివేసిన టీడీపీ గూండాలు. #TDPGoons pic.twitter.com/E8C9zK9NQ7
తర్వాతి కథనం
