ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2024 (20:59 IST)

లావణ్యతో తెలిసే ఆ రిలేషన్ పెట్టుకున్నా : తేల్చి చెప్పిన రాజ్ తరుణ్

Raj Tarun, malvi malhortra
Raj Tarun, malvi malhortra
కథానాయకుడు రాజ్ తరుణ్, లావణ్య సహజీవనం పెద్ద రచ్చ అయిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులకు ఆయన అందుబాటులో లేడని వార్తలు కూడా వచ్చాయి. కానీ నేడు తిరగబడరా సామి సినిమా ప్రమోషన్ కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆయన ఓ విధమైన వాయిస్ తో సమాధానం చెప్పడం విశేషం. లావణ్యతో సెక్యువల్ సంబంధం తెలిసే పెట్టుకున్నా. కానీ దాన్ని అవకాశంగా తీసుకుని ఆడిస్తుందని చెప్పారు. ఆమె తగు సాక్షాలు చూపిస్తుంది గదా అన్న ప్రశ్నకు... లావణ్య చెప్పిన ప్రూఫ్ కంటే నాదగ్గర ఎక్కువ వున్నాయి,  అవి పోలీసులకు ఇవ్వను. కానీ మా లాయర్ ద్వారా కోర్టుకు ఇస్తా అని అన్నారు. 
 
మీ తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లు మీ స్నేహితుడు అన్నీ వివరాలు చెబుతున్నాడుగదా. మీకు తెలీకుండా జరుగుతుందా? అన్న ప్రశ్నకు.. ఆయన ఫ్రూఫ్ తో నిరూపిస్తున్నారు. కానీ అలా చేయమని నేను చెప్పలేదని తెలివిగా సమాధానం ఇచ్చారు. 
 
అయితే లావణ్య వెనుక నన్ను బద్ నామ్ చేసేందుకు ఎవరి హస్తం లేదని అలా వున్నారని అనుకోవడంలేదని అన్నారు. అయితే సినిమా ట్రైలర్ లో మాల్వీకి మీకు మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయింది అనగా, గట్టిగా నవ్వుతూ మీరు సినిమా చూస్తే అన్నీ వివరాలు తెలుస్తాయి అంటూ వివరించారు.