శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 మే 2024 (12:03 IST)

ఓటు వేసేందుకు క్యూ అతిక్రమించిన ఎమ్మెల్యే... చెంప ఛెళ్లుమనిపించిన సాధారణ ఓటరు.. వీడియో వైరల్

Tenali MLA Sivakumar jumping queue, was slapped by voter
ఓటరు ఒకరు ఎమ్మల్యే చెంప ఛెళ్లుమనిపించారు. ఓటు వేసేందుకు వరుసలో రాకపోవడమే ఆ ఎమ్మెల్యే చేసిన తప్పు. వరుస క్రమంలో రావాలని తెనాలి అధికార పార్టీ ఎమ్మెల్యే శివకుమార్‌ను ఒక ఓటరు కోరారు. దీన్ని ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు కదా... ఆ ఓటరుపై చెంపపై కొట్టాడు. దీంతో ఆ ఓటరు కూడా తిరిగి ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అప్పటికే అనేక మంది ఓటర్లు క్యూలో ఉన్న ఓటర్లను పట్టించుకోకుండా ఆయన పోలింగ్ బూత్‍‌లోకి వెళ్ళేందుకు ప్రయత్నించారు. ఇది చూసిన క్యూలో ఉన్న ఒక ఓటరు అభ్యంతరం తెలిపారు. అందిరితో పాటు క్యూలో రావాలని సూచించారు. 
 
దీంతో ఆవేశానికి లోనైన ఎమ్మెల్యే శివకుమార్ ఆ ఓటరుపై చేయి చేసుకున్నారు. సడెన్‌గా జరిగిన ఈ సంఘట నుంచి వెంటనే తేరుకున్న ఆ ఓటరు... అదే స్పీడ్‌తో ఎమ్మెల్యే శివకుమార్ చెంపపై ఒక్కటిచ్చాడు. ఇది చూసిన అక్కడే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు రంగంలోకిదిగి ఆ ఓటరుపై మూకుమ్మడిగా దాడి చేశారు. పిడిగుద్దులు కురిపిస్తూ బయటకు లాక్కెళ్లారు.